SC,ST విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఉన్నత చదువు ఎక్కడైనా ఫ్రీ

vbk-cric-69946f-1466561127SC,ST విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఫ్రభుత్వం. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఎక్కడ చదివినా వారి ఫీజులను సర్కారే భరించనుంది. ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం రాష్ట్ర పరిధిలోని విద్యా సంస్థల వరకే పరిమితం. సెట్‌ (కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాసిన తర్వాత కన్వీనర్‌ కోటాలో వచ్చే సీట్లకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇస్తోంది. ప్రతిభావంతులైన SC, ST విద్యార్థులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అందులో చేరలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, IIT, NITలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన SC, ST విద్యార్థుల ఫీజులను భరించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఈ పథకం 2017–18 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చినా.. కేటగిరీల వారీగా విద్యాసంస్థలు, వర్సిటీల పేర్లను చెబుతూ.. SC అభివృద్ధి శాఖ రూపొందించిన ప్రతిపాదనలను లేటెస్ట్ గా ఆమోదించింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత చదువులపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీ, IIT సీట్లలో రాష్ట్ర విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులూ పలు పోటీ పరీక్షల్లో మంచి ట్యాలెంట్ కనబరుస్తూ.. టాప్ వర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో SC, ST విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Posted in Uncategorized

Latest Updates