ప్రతిపక్షంలో మజ్లిస్.. అసెంబ్లీలో సీట్ల మార్పు

బడ్జెట్ సెషన్ ఇవాళ ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీట్ల మార్పు జరిగింది. సీఎల్పీ .. టీఆర్ఎస్ లో విలీనంకావడంతో… ప్రధాన ప్రతిపక్షం లైన్ లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు సీట్లను కేటాయించారు.

గతంలో మజ్లిస్ కూర్చున్న స్థానంలో ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ఈ అసెంబ్లీలో మజ్లిస్ కు ఏడుగురు సభ్యుల బలముంది. కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు.

కొత్త మంత్రుల సీటింగ్ లోనూ మార్పులు కనిపించాయి.

 

Latest Updates