కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సీట్ల పేచీ

seat fight between congress and JDS

బెంగళూరు: కర్ణాటకలో ఎంపీ సీట్ల పంపకంపై సీట్ల పేచీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.  ఆ రాష్ట్రంలో మొత్తం లోక్ సభ స్థానాలు 28. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో బేరమాడి కనీసం 10 సీట్లలో పోటీ చేయ్యాలని జేడీఎస్ చూస్తోంది. అయితే 5,6 సీట్లకు మించి జేడీఎస్ కు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 9 ఎంపీ సీట్లు గెలిస్తే జేడీఎస్ కేవలం 2 సీట్లను గెలిచింది. కాంగ్రెస్ రాష్ట్రమంతా ఉన్న పార్టీ అని జేడీఎస్ కేవలం ఓల్డ్ మైసూరు రీజియన్ కే పరిమితమైన పార్టీ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కనీసం 8 నుంచి 10 సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా వేర్వేరుగా పోటీకైనా సిద్ధమని జేడీఎస్ అంటున్నట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 సీట్లల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాయకులు చర్చించుకుంటున్నారు.

Latest Updates