ఎన్ఎస్ఈపై 6 నెలల నిషేధం

Sebi bars NSE from accessing securities market for 6 months in co-location case

కో–లొకేషన్ సర్వర్ల కేసులో సెబీ ఆదేశం

ముంబై : కో–లొకేషన్ సర్వర్ల కేసులో దిగ్గజ స్టాక్ఎక్స్చేంజ్‌ ఎన్‌ఎస్‌‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది.ఈ కేసులో ‘ఎన్‌ ఎస్‌‌ఈ’ని  సెక్యురిటీస్ మార్కెట్ల నుంచి ఆరు నెలల పాటు నిషేధిస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్‌కు వార్షికంగా 12 శాతం వడ్డీతో పాటు రూ.625 కోట్లను ఎన్‌ ఎస్‌‌ఈ జరిమానా కింద చెల్లించాలని సెబీ ఆదేశించింది. 2014 ఏప్రిల్ నుంచి ఏడాది లెక్కన ఈ 12 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. వడ్డీతో జరిమానా మొత్తం దాదాపు రూ.1000 కోట్లు కావచ్చు. ఎన్‌ ఎస్‌‌ఈ  తరచూ సిస్టమ్ ఆడిట్లు చేపట్టాలని కూడా ఆదేశించింది.

ఈ కేసులో ఇద్దరు ఎన్‌ఎస్‌‌ఈ మాజీ సీఈవోలు రవి నారాయణ్‌ ,చిత్రా రామక్రిష్ణన్‌ తో పాటు 16 మందికి వ్యతిరేకంగా సెబీ ఆర్డర్లు జారీ చేసింది. మాజీ సీఈవోలు ఇద్దరి నుంచి వారి జీతంలో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులోని ఎన్‌ఎస్‌‌ఈ ఉన్నతాధికారులను ఐదేళ్ల పాటు ఎలాం టి లిస్టెడ్ కంపెనీకి లేదా మార్కెట్ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్ ఇన్‌ స్టిట్యూ షన్‌ కు లేదా ఇతర మార్కెట్ ఇంటర్‌ ‌‌‌మీడియేటరీలలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కో–లొకేషన్ సర్వర్ల కేసు 2 015కు చెందిం ది. కొంత మంది ఎంపిక చేసిన హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్లు, బ్రోకర్లకు మాత్రమే  ప్రిఫరెన్సి యల్ యాక్సస్‌‌ను ఎన్‌ ఎస్‌‌ఈ ఇస్తోందని ఓ విజిల్ బ్లోయర్ సెబీకి లేఖ రాశారు.

Latest Updates