ఇండిగోలో అవకతవకలు నిజమే..

న్యూఢిల్లీ: కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌లో ఇండిగో బోర్డు విఫలమైందని, రిలేటడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్ల(ఆర్‌పీటీలు)లోనూ అవకతవకలు జరిగాయని సెబీ తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌పీటీలను కంపెనీసాగించింది. రిలేటడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లు కంపెనీ టర్నొవర్‌ లో ఒక శాతాన్ని మించకూడదు. ఒకవేళ మించితే షేర్‌ హోల్డర్ల అనుమతి తప్పనిసరిగా కంపెనీ తీసుకోవాలి. కొన్ని ఆర్‌ పీటీలకు ఆడిట్‌‌ కమిటీ అనుమతి కూడా లేదు. మరికొన్ని ట్రాన్సా క్షన్లకు పేమెంట్‌‌ పూర్తయ్యాక అనుమతులు తీసుకున్నారు. ఈ అంశాలన్ని సెబీ గుర్తించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కంపెనీ కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌ రూల్స్‌‌ను రాహుల్‌ భాటియా పాటించడం లేదంటూ గతేడాది జులైలో కంపెనీ కో ఫౌండర్‌ రాకేష్‌ గంగ్వాల్‌ సెబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . ఈ విషయాలపై దర్యాప్తు చేయడానికి సెబీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫిర్యాదులో రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్లు, సీనియర్‌ మేనేజ్‌ మెంట్‌‌, డైరక్టర్లు, చైర్మన్‌‌ల నియామకం వంటివిషయాలలో అవకతవకలు జరిగాయని గంగ్వాల్‌ పేర్కొన్నారు. అయితే ఈ విషయాలను భాటియా అప్పట్లో ఖండించారు. ఇండిగో టర్నొవర్‌లో ఆర్‌పీటీలు కేవలం 0.53 శాతమేనని భాటియా వివరణ ఇచ్చారు. ఇండిగోను నిర్వహించే ఇంటర్‌ గ్లో బ్‌ ఏవియేషన్‌‌ లిమిటెడ్‌‌లో రాకేష్‌ గంగ్వాల్‌ , ఆయన అసోషియేట్స్‌‌కు 37 శాతం వాటా, రాహుల్‌ భాటియాకు చెందిన ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌‌(ఐజీఈ) కి 38 శాతం వాటా ఉన్నాయి. దర్యాప్తు వివరాల మీద ఐజీఈ గ్రూప్‌ , సెబీ, గంగ్వాల్‌ లు ఇంకా స్పందించలేదు.

Latest Updates