భారత్‌లో కరోనా వల్ల రెండో మృతి

68 ఏళ్ల ఢిల్లీ మహిళ కొవిడ్‌తో మృతి

దేశంలో కరోనా రెండో మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్‌కు బలైంది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయిన ఆమె.. కొద్ది రోజులుగా అక్కడి రామ్ మనోహర్​ లోహియా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటోంది. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి చనిపోయింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఆమె మరణాన్ని కన్ఫమ్ చేశారు. హాస్పిటల్ నుంచి తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 81కి పెరిగింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇటలీలో మరణాల రేటు దారుణంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది కొవిడ్‌కు బలయ్యారు. దాదాపు 1,32,000 మంది దాని బారిన పడ్డారు. వైరస్‌కు కారణమైన చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80,815 కేసులు అక్కడ రికార్డవగా, 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది. 1,016 మంది కొవిడ్‌కు బలయ్యారు. దాదాపు 15,113 కేసులు నమోదయ్యా యి. రెండు రోజుల క్రితం 10 వేల కేసులే ఉండగా, ఇప్పుడు 15 వేల మార్కును దాటేశాయి. ఇక ఇరాన్‌లో 514 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 71, స్పె యిన్‌లో 120, ఫ్రాన్స్‌లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగగా.. పాజిటివ్ కేసులు 1,832 నమోదయ్యాయి.

For More News..

చెట్లు నరికితే జైలుకే

హైదరాబాద్‌ స్కూళ్లను ఢిల్లీ లెక్క మారుస్తం

లోక్‌సభకు చేరిన రేవంత్ వ్యవహారం

మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా

కరెంట్ చార్జీలు పెరిగితే భరించాలే

Latest Updates