లోక్ సభ ఎన్నికలు: రెండో దశలో 67.84% పోలింగ్

Second phase of polls records voter turnout of 67.84%
  • ​పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు, అభ్యర్థులపై దాడులు
  • శ్రీనగర్​లో అత్యల్పంగా 14.8 శాతం

న్యూఢిల్లీ: చాలా చోట్ల ఈవీఎంలలో లోపాలు, కొన్ని చోట్ల ఓటర్ల ఆందోళనలు, అభ్యర్థులపై దాడులు, పోలీసుల లాఠీచార్జి లాంటి ఘటనల నడుమ గురువారం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​ ముగిసింది. 95 లోక్ సభ స్థానాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు 67.84 శాతం పోలింగ్​ నమోదైనట్లు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా మీడియాకు తెలిపారు. ఐదు గంటల తర్వాత కూడా చాలా చోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నందున పోలింగ్​ శాతం పెరగొచ్చన్నారు. 384 పోలింగ్​ స్టేషన్లలోఈవీఎంలలో లోపాలు తలెత్తగా కొత్తవాటిని అమర్చామని, 692 వీవీప్యాట్ మిషిన్లను రీప్లేస్ చేశామన్నారు. ‘‘గురువారం నాటి రెండో దశతో మొత్తం10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది’ అని సిన్హా ప్రకటిం చారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ స్థానంలో అత్యల్పం గా14.8 శాతం పోలింగ్​ మాత్రమే నమోదైంది. 80 శాతానికిపైగా టర్నౌట్ తో మణిపూర్, పుదుచ్చేరిలు అగ్రభాగాన నిలిచాయి. ఇక పెద్ద సంఖ్యలో ఓటుకు నోటు కేసులు నమోదైన తమిళనాడులో పోలింగ్​ శాతం 66.39గా రికార్డైంది. ఏడు దశల లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న జరిగిన మొదటిదశలో 69.43 శాతం, రెండో దశలో 67.84 శాతం ఓటింగ్​ నమోదైంది. మూడో దశ పోలింగ్​ ఏప్రిల్ 23న జరుగనుంది.

ఓటర్లపైకి టియర్ గ్యాస్

రెండో దశ పోలింగ్​లో పలు రాష్ట్రాల్లో హింస చోటు-చేసుకుం ది. పశ్చిమబెంగాల్ లో డార్జిలింగ్​ మినహా పోలింగ్ జరిగిన మరో జల్పాయిగురి, రాయ్ గంజ్ ల్లో చాలా చోట్ల సీపీఎం, తృణమూల్ కార్యకర్తలు వీధి పోరాటాలకు దిగారు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. స్వే చ్ఛగా ఓటేయనివ్వడం లేదంటూ ఆందోళనకు దిగిన కొందరు ఓటర్లను చెదరగొట్టే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ , వాటర్ కెనాన్లను వాడారు. ఓటు వేయడానికి వెళుతున్న రాయ్ గంజ్ లోక్ సభ సీపీఎం అభ్యర్థి మొహ్మద్ సలీం కారు పైటీఎంసీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కాశ్మీర్ లో శ్రీనగర్ లోక్ సభ సెగ్మెం ట్ లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఏప్రిల్ 23కు పోలింగ్​ వాయిదాపడ్డ త్రిపుర ఈస్ట్​ స్థానంలో కాం గ్రెస్ అభ్యర్థి ప్రగ్యాదేవ్ బర్మన్ కాన్వాయ్ పై ఐపీఎఫ్ టీ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ లో ఎన్నికల సిబ్బంది గుండెపోటుతో మరణించారు.ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఎన్ని కల డ్యూటీకి వెళుతున్న ఉద్యోగినిని మావోయిస్టులు  కాల్చిచంపారు.

శ్రీనగర్​లో కనిపించని మార్పు

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లోక్ సభ సెగ్మెంట్ ఎప్పటిలాగే దేశంలోనే అత్యల్పంగా, 14.8 శాతం ఓటింగ్​ నమోదైంది. వేర్పాటువాదుల ప్రాబల్యం బలంగా ఉన్న ఈ ఏరియాలో 2017 ఉప ఎన్నికలోనూ 7.13శాతమే ఓటింగ్​ రికార్డైంది. 2014 జనరల్ ఎలక్షన్స్ లో 26 శాతం ఓటింగ్​ నమోదైం ది.

ఎన్నికల ప్రక్రియ పూర్తైన రాష్ట్రా లు

దేశంలోని 543 స్థానాలకుగాను రెండో దశతో186 సెగ్మెంట్లలో పోలింగ్​ ప్రక్రియ పూర్తైంది. అదే రాష్ట్రాల వారీగా చూస్తే 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని కల ప్రక్రియ ముగిసినట్లైంది. ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ(17),అరుణాచల్ ప్రదేశ్ (2), అండమాన్ నికోబార్ (1),లక్ష్యద్వీప్ (1), మణిపూర్ (2), మేఘాలయ(2),మిజోరం(1), నాగాలాండ్​(1), పుదుచ్చేరి(1),సిక్కిం (1), తమిళనాడు(38– వెల్లూ రులో రద్దైన ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే ది ఈసీ ప్రకటించలేదు), ఉత్తరాఖండ్​(5)లో ఎన్ని కల ప్రక్రియ పూర్తైనట్లు ఈసీ ప్రకటించింది.

 

Latest Updates