చిప్సా, దోశలా : కరోనా పేషెంట్లకు సొంత డబ్బుతో కోర్కెలు తీరుస్తున్న డాక్టర్

ఆమె నోడల్ ఆఫీసర్, ఇంచార్జ్ డాక్టర్.. కరోనా పెషెంట్లు ఆడగడమే ఆలస్యం  చిప్స్ నుంచి దోశల వరకు సొంత ఖర్చులతో వారి కోర్కెల్ని తీరుస్తూ అండగా నిలుస్తున్నారు.

బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి లో ఓ విభాగాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. ఈ బ్లాక్‌ మొత్తానికి నోడల్ ఆఫీసర్, ఇన్‌చార్జిగా డాక్టర్ ఆశిమా బాను విధులు నిర్వహిస్తున్నారు. బాధితులకు ట్రీట్ మెంట్ ఇవ్వడమేకాదు వాళ్లు అడిగినవన్నీ సొంతఖర్చుతో  అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పేషెంట్లకు చికిత్స చేయడమే కాదు..వాళ్లకి కావాల్సిన అవసరాల్ని తీర్చడం తమపైనే ఉందన్నారు.

ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్

కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తూనే వారి అవసరాలు తీర్చేందుకు డాక్టర్ ఆశిమా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. వార్డ్ లో ఉన్న పేషెంట్ల అవసరాల్ని తీర్చేందుకు సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు.  ఆ వాట్సాప్ గ్రూప్ లో బాధితులు ఎవరైనా తమకు టిఫిన్ , బిస్కెట్లు ఇలా వారి  అవసరాల్ని తీరుస్తూ  మన్నల్ని పొందుతున్నారు డాక్టర్ అశిమా.

Latest Updates