సెక్రటేరియట్ 90% నేలమట్టం

పోలీసుల్ని పెట్టి జనాన్ని

ఎందుకు అడ్డు కుం టున్నరు?

ఉత్తర్వుల్లేకుం డా ఆంక్షలా.. అసలు అధికారం ఎక్కడిది?

ట్రాఫిక్ ను చట్టం ప్రకారం నియంత్రిస్తు న్నరు?

ప్రభుత్వ వైఖరి చెబుతామంటూ ఇంత లేట్ చేస్తారా?

ఇన్ని రోజులుగా విచారణ జరుగుతుంటే..

ఇప్పుడు రిట్ కు విచారణ అర్హత లేదనడమేంది?

సెక్రటేరియట్ కూల్చివేత కేసులో సర్కారుపై హైకోర్టు అసహనం

కౌంటర్ వేయాలని ఆదేశం..

రేపటికి విచారణ వాయిదా..

 

ఆనవాళ్లు లేకుండా పోయిన , బీ, సీ, డీ బ్లాక్ లు

గుడి, మసీదులు కూడా పూర్తిగా పడగొట్టిన్రు

భారీ హైడ్రాలిక్ మెషీన్లతో రాక్ బిల్డింగ్, జీ బ్లాక్ కూల్చివేత

న్యాయ పోరాటం చేసి ఫొటోలు, వీడియో తీసిన వీ6-­వెలుగు

హైదరాబాద్ , వెలుగు: అత్యంత రహస్యంగా.. ఆగమాగంగా.. సెక్రటేరియట్ బిల్డింగ్​లన్నీ ప్రభుత్వం పడగొట్టింది. శనివారం సాయంత్రం వరకే దాదాపు 90 శాతం బిల్డింగ్​లను పూర్తిగా కూల్చేసింది. సీఎం చాంబర్ , సీఎంవో ఆఫీసర్లుండే సమత బ్లాక్​ (సీ బ్లాక్​) కనిపించకుండా పోయింది. పక్కనే ఉన్న ఏ, బీ బ్లాక్​లు, అధునాతనంగా కనిపించే డీ బ్లాక్​ బిల్డింగ్​లను పునాదుల వరకు పెకిలించారు . అయిదు అంతస్తులున్న ఈ బిల్డింగ్​లన్నీ ఇప్పటికే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ ప్రాంతం దాదాపుగా చదును చేశారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఉన్న గుడి, మసీదులు పూర్తిగా కూల్చేశారు. డీ బ్లా క్ పక్కన ఉండే పురాతన రాక్ బిల్డిం గ్ , నిజాం కాలం నాటి జీ బ్లా క్ ను భారీ హైడ్రాలిక్ మెషిన్లతో పడగొట్టారు . మీడియా పాయింట్ గా ఉండే చి న్న హాల్ తప్ప.. విభజన సందర్భంగా తెలంగాణకు కేటాయించిన బ్లాక్ లన్నీ శిథిలమయ్యాయి.

సువిశాలంగా ఉండే సెక్రటేరియట్ ప్రాం గణం మొత్తం ఇప్పుడు ఇటుకలు, రాళ్లు, సిమెం ట్ దిబ్బల కు ప్పగా కనిపిస్తోంది. అత్యంత రహస్యంగా సెక్రటేరియట్ బిల్డింగ్ లనుప్రభుత్వం కూల్చేయటం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి .. వేలాది మంది పోలీసుల కాపాలా నడుమ అర్ధరాత్రి కూల్చివేత పనులు ప్రారంభించటం అనుమానాలకు తెరలేపింది. కనీసం మీడియా కవరేజీకి చాన్స్ లేకుండా అడ్డుకోవటం, పరిసరాల్లోకి ఎంట్రీ లేకుండా పోలీసులతో కట్టడి చేసింది. ఇంతకాలం పరిపాలన కేంద్రం గా ఉన్న సెక్రటేరియట్ కూల్చివేత రహస్యం గా ఉంచటం అన్యాయమని, ప్రజా ధనంతో కట్టిన బిల్డింగ్ లను పడగొట్టేప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకుండా కవరేజీని అడ్డు కోవటం మీడియా స్వేచ్ఛను కాలరాయటమేనని ఇటీవలే వీ6, వెలుగు దినపత్రిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని 19 (1) (ఎ) ఆర్టికల్ ను ప్రభుత్వం తుంగలో తొక్కిందని హైకోర్టుకు నివేదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా.. సెక్రటేరియట్ ను రహస్యంగా ఎందుకు కూలుస్తున్నారు ..? వేలాది మంది పోలీసుల కాపలా ఎందుకు..? మీడియా కవరేజీని ఎందుకు అడ్డుకుంటున్నారు ..? ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులను ఎందుకు రంగంలోకి దిం పారు..? అంటూ హైకోర్టు వరుసగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది. పరిసరాల్లోకి, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ లపైకి కూడా అనుమతించకపోవటాన్ని తప్పు పట్టింది.

సెక్రటేరియట్‌ బిల్డింగుల‌ కూల్చివేత పనుల్ని చిత్రీకరించేందుకు సమీప భవనాలపైకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోరాదని హైకోర్టు శుక్రవారమే మధ్యంతర ఉత్తర్వులు జా రీ చేసింది. సెక్రటేరియట్‌ సమీప బిల్డింగ్స్ పైకి వెళ్లడం ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తు లకు సంబంధించిన వ్యవహారమని, దీనిని అడ్డుకునే అధికారం రాష్ట్రాని కి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పరిసరాల్లో పోలీసు ఆంక్షలను కొంత మేరకు సడలిస్తూ మౌఖికంగా ఆదేశాలు జా రీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యం లో సెక్రటేరియట్ కూల్చివేత పనులను దూరం నుంచైనా కవర్ చేసేందుకు వీ6, వెలుగు ప్రయత్నం చేసింది. శనివారం సాయంత్రం  మింట్ కాంపౌడ్ ఏరియాలో ఉన్న భవనాలపై నుంచి సెక్రటేరియట్ లో జరుగుతున్న పనులకు సంబంధించి ఫొటోలు, వీడియోలను ఎక్స్ క్లూజివ్ గా కవర్ చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలే ఇవి…

Latest Updates