ఈ విషయంలో భార్య‌ల‌తో తస్మాత్ జాగ్రత్త

కొన్ని విషయాల్లో భార్యభర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కష్టాలుకొని తెచ్చుకుంటారు. అలా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లితరువాత కొందరు నోరుజారతారని అంటున్నారు. ముఖ్యంగా గతంలో తమకున్న లవ్ ఎఫైర్లు, శృంగార కార్యకలాపాల గురించి తమ భాగస్వామితో చర్చిస్తారు. అలా చేయోద్దని సూచిస్తున్నారు. మీరు ఇబ్బంది పెట్టే సమయంలో వాటి గురించి ప్రస్తావిస్తూ మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. శృంగారాన్ని అమితంగా ఇష్టపడేవారు ఎమోషనల్ గా ఉండలేరంట. అందుకే మీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో ముందుగానే మీ భాగస్వామితో నిరూపించుకోవాలంటున్నారు. కొంతమంది అన్నీంటికి పాస్ వర్డ్స్ పెట్టుకుంటారు. అలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. పాస్ వర్డ్స్ అంటే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో సూచిస్తుందంట. కొన్ని కుటుంబ వ్యవహారాలు పర్సనల్ లైఫ్ పై దుష్ర్పభావం చూపుతాయి. అబ్బాయి ఫ్యామిలీ , అమ్మాయి ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల గురించి అసభ్యంగా మాట్లాడడం వల్ల ఇమేజ్ దెబ్బతింటుంది. ఒకవేళ భాగస్వామి అదే ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే.. అలాంటి విషయాల గురించి వాళ్లను అడగకపోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest Updates