సుప్రీంకోర్టు బయట 144 సెక్షన్ : CJI తీర్పు ఎఫెక్ట్

ఢిల్లీలోని సుప్రీంకోర్టు బయట 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా కనపడితే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై… చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ కు క్లీన్ చిట్ ఇస్తూ.. సోమవారం రోజున జస్టిస్ బాబ్డే కమిటీ ఓ రిపోర్టు అందజేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం నాడు ఓ నోటీసు కూడా రిలీజ్ చేశారు.

ఐతే… కమిటీ ఇచ్చిన రిపోర్టును పిటిషనర్, మహిళా ఉద్యోగి తప్పుపట్టారు. సీజేఐకి క్లీన్ చిట్ ఇవ్వడం అన్యాయం అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఓ మహిళకు న్యాయం జరగలేదని అన్నారు. ఆమెకు మద్దతుగా… మహిళా సంఘాలు, కొందరు లాయర్లు సుప్రీంకోర్టును ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో… సుప్రీంకోర్టు ముందు బందోబస్తు పెంచారు. 144 సెక్షన్ విధించారు.

ఏప్రిల్ 19న చీఫ్ జస్టిస్ పై మహిళా ఉద్యోగిని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీల ఇన్ హౌజ్ కమిటీ విచారణ జరిపింది. జస్టిస్ బాబ్డే నాయకత్వంలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. ఏప్రిల్ 30న మహిళా ఉద్యోగి కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. మే 1న సీజేఐ రంజన్ గొగోయ్ కమిటీ విచారణ ఎదుర్కొన్నారు. మే 6న కమిటీ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ అందజేసింది.

Latest Updates