చర్లపల్లి జైలు దగ్గర 144 సెక్షన్

హైదరాబాద్ చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దిశ హత్య కేసు నిందితులు అదే జైల్లో ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించడానికి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు.

దిశ హత్య కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలనే పోలీసుల పిటిషన్ పై ఇవాళ(మంగళవారం) కోర్టులో విచారణ జరగనుంది. నిందితులను విచారించేందుకు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దిశ మొబైల్ ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని పిటిషన్ లో తెలిపారు. పిటిషన్ ను షాద్ నగర్ కోర్టు విచారించనుంది.

Latest Updates