లంచం తీసుకుంటూ సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ అరెస్ట్

నాగరాజు- పంచాయతీ రాజ్ సెక్షన్ ఆఫీసర్

 హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలోని సెక్రటేరియట్ లో లంచగొండి అధికారి బాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ) బయటపెట్టింది. పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న నాగరాజును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకుంది. న్యాయంగా జరగాల్సిన తన పని పూర్తిచేసేందుకు లంచం అడిగాడు అంటూ ఓ బాధితుడు ఏసీబీ అధికారులను కలిశాడు. అధికారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేసింది ఏసీబీ. బాధితుడి నుంచి రూ.60 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

Latest Updates