అఖిలప్రియ ఆరోగ్యంపై నివేదికివ్వండి..కోర్టు ఆదేశం

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్ తీర్పును సోమవారానికి వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్టు. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తన ఆరోగ్యం బాగాలేందని..తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది అఖిలప్రియ. అయితే బెయిల్ వస్తే…సాక్ష్యాలను తారుమారు చేస్తారని…బెయిల్ ఇవ్వొదంటూ కౌంటర్ పిటిషన్ వేశారు పోలీసులు. సాక్షులను బెదిరించే చాన్సుందన్న అభియోగాలపై వాదనలు వినిపించారు. కేసును కిడ్నాప్ తో పాటు.. దోపిడీ కేసుగా కూడా పరిగణించాలని.. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. రెండు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు.

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేసు విచారణ సందర్భంగా సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు హడావుడి చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ లొంగిపోతాడన్న సమాచారంతో పోలీసులు ఓవర్ గా అలర్ట్ అయ్యారు. ముందస్తుగానే.. బారికేడ్లు పెట్టి.. కోర్టు తలుపులు మూసేశారు పోలీసులు. వాయిదాల కోసం వచ్చిన వారిని కోర్టు బయటే ఉంచారు పోలీసులు. దీంతో.. పోలీసులతో కొందరు లాయర్లు గొడవ పడ్డారు.

Latest Updates