బ్యాటరీ బైక్ ను కనుగొన్న సికింద్రాబాద్ ఆడబిడ్డ

బ్యాటరీతో నడిచే బైక్ ను తయారు చేసింది ఓ సికింద్రాబాద్ ఆడబిడ్డ. సీతాఫల్ మండి వారాసిగూడ కు చెందిన చింతల రమ్య ప్రియ నగరంలోనే  MBA వరకు చదువుకుంది. అయితే చిన్నప్పటినుంచి ఏదైనా కొత్తగా చేయాలని తపించే రమ్య.. పొల్యూషన్ లేని బైక్ ను తయారుచేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా..  తన రిసెర్చ్ ను కొనసాగించింది. దీంతో జీరో పొల్యూషన్ గల బైక్ ను తయారుచేసింది. దీనికి మూడు గంటలు చార్జింగ్ పెడితే చాలు 40కిలోమీటర్లు పోవచ్చు.

రమ్య తయారు చేసిన బైక్ కు..  “జీరో పొల్యూషన్ ఎలక్ట్రిక్ పెడల్ బైక్” ప్రివిలేజ్ ఆటో మొబైల్ పెడల్ బైక్ అనే పేరు పెట్టింది. తాళం చెవి ఇగ్నిషన్ ఆన్ చేసి ఎక్స్ లెటర్ ఇస్తే చాలు ఎలాంటి చప్పుడు,పొగ లేకుండా వెళ్తుంది. 600కిలోల బరువుతో కూడా ఈ బైక్ 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని చెప్పింది రమ్య. ఇటువంటి బైక్ పేపర్ బాయ్ లకు, పోస్ట్ మ్యాన్ లకు, గల్లీల్లో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్లే వారికి ఉపయోగపడుతుందిని తెలిపింది. ఒక వేల చార్జింగ్ అయిపోయినా… పెడల్ ను ఉపయోగించి సైకిల్ లాగా తొక్కుకుంటూ రావొచ్చని చెప్పింది. బైక్ తయారీ ఖర్చు 25 వేల నుంచి 35 వేల వరకు ఖర్చు అవుతదని తెలిపింది రమ్య. ఈ రోజు బైక్ ను టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ డిప్యుటీ స్పీకర్ టి. పద్మారావు పరిశీలించి రమ్యను అభినందించారు.

Latest Updates