అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు

హైదరాబాద్‌ : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అయితే.. అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. జీవితకాలం శిక్షపడే కేసులు తమ పరిధిలోకి రావని చెప్పింది సికింద్రాబాద్ కోర్టు. సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది.

దీంతో అఖిలప్రియ బెయిల్‌కోసం నాంపల్లి కోర్టులో మరో పిటిషన్‌ వేయనున్నట్లు సమాచారం. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన భూమా అఖిలప్రియ ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా చంచల్‌ గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.

Latest Updates