సరిహద్దుల్లో చైనా కదలికలపై పహారాకు శాటిలైట్‌లు

న్యూఢిల్లీ: లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నుంచి చైనా దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఎల్‌ఏసీ వద్ద గస్తీని పెంచడంపై ఇండియా దృష్టి పెట్టింది. 4 వేల కిలో మీటర్లు విస్తరించి ఉన్న ఎల్‌వోసీ వెంబడి గస్తీని ఉంచడం అంత సుసాధ్యం కాదు. అందుకే చైనా కదిలకలను నిత్యం పర్యవేక్షించడానికి దాదాపు నాలుగు నుంచి ఆరు శాటిలైట్స్‌ను మన ఆర్మీ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి సుమారు 40 వేల చైనా ట్రూప్స్ ఆయుధాలతో కాపు గాసి ఉన్నారని సమాచారం. దీంతో ఎల్‌ఏసీతో పాటు లేహ్‌లోని 14 కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ను కవర్ చేసేలా ఆర్మీ శాటిలైట్స్‌ను ఏర్పాటు చేయనుందని తెలిసింది. ‘ఇండియా భూభాగంతోపాటు లోతైన ఏరియాల్లో చైనా దళాల కదలికలను పర్యవేక్షించడానికి నాలుగు నుంచి ఆరు హై రిజల్యూషన్ సెన్సార్స్, కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో చిన్న కదలికలను కూడా ఇవి పట్టేస్తాయి’ అని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.

Latest Updates