తిరిగి పోతాం అంటేనే అమెరికా వీసా

వీసా కావాలంటే ‘సెక్యూరిటీ బాండ్ ’ ఇవ్వాల్సిందే

గడువు లోపు వాపస్ పోకుంటె డబ్బులు వాళ్లకే..

అక్రమ నివాసితులపై చర్యలకు ట్రంప్ సర్కారు నిర్ణయం

అలాంటివారు 10 శాతానిపైగా ఉండే దేశాలపై స్పెషల్​ ఫోకస్

వీసాల సంఖ్య, గడువు తగ్గింపు వంటి చర్యలు.. త్వరలోనే అమల్లోకి..

స్టూ డెంట్ వీసాలకు అమలు చేస్తే మనపైనే ఎక్కువ ప్రభావం

వాషింగ్టన్ : అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా, వీసా కోసం అప్లై చేస్తున్నారా.. అయితే జమానతు (బాండ్) కోసం పైసలు రెడీ చేసుకోండి. ఇక ముందు అమెరికా టూరిస్టు, బిజినెస్, స్టూ డెంట్ వీసా రావాలన్నా, ఆ దేశానికి వెళ్లాలన్నా.. కొంత మొత్తంలో సొమ్మును జమానతుగా పెట్టాల్సిందే. వీసా టైం అయిపోయే లోపు తిరిగి వెళ్లిపోకుంటే ఆ సొమ్మును అమెరికా సర్కారు తీసేసుకుంటుం ది. వివిధ దేశాల నుంచి అమెరికా వస్తున్నవారు వీసా గడువు అయిపోయినా అక్కడే ఉంటుండటంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలకు ఇటీవల ఓ మెమో జారీ చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని.. ఏయే దేశాల వారిపై చర్యలు ఉండాల్నో, జమానతు మొత్తం ఎంత ఉండాల్నో, ఎన్ని రోజులు అదనంగా ఉండే వా రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్నో చెప్పాలని సూ చించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పుడే అమల్లో కి రా వడం లేదు. 120 రోజులు గడువిచ్చింది. సూ చనలు, సలహాలు స్వీ కరిం – చిన తర్వా త దీనిని అమలు చేయనున్నారు. ఈ బాం డ్ మొత్తం కనీసం రెం డు వేల డాలర్లకుపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నా రు.

నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై..

పర్యా టకం, బిజినెస్, చదువుకోవడం కోసం అమెరికా- కు చాలా దేశాల నుంచి లక్షలాది మంది వస్తుంటా రు. ఇందుకోసం అమెరికా బీ1, బీ2, ఎఫ్ కేటగిరీ వీసాలు జారీ చేస్తుంది. బీ1, బీ2 వీసాలపై అవసరాన్ని బట్టి వారం రోజుల నుంచి మూడు నెలల వరకు గడువు ఉంటుం డగా.. ఎఫ్ కేటగిరీ స్టూ డెంట్ వీసాలకు సదరు కోర్సు, అప్రెంటి స్ షి ప్ కాల పరిమితిని బట్టి గడువు ఉంటుం ది. వా రంతా ఈ సమయం ముగిసే – లోగా తమ దేశాలకు తిరిగి వె ళ్లిపోవాల్సి ఉంటుం ది. కానీ చాలా మంది గడువు తీరినా అమెరికాలోనే ఉండిపోతున్నా రు. ఈ వీసాలతో అమెరికాకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవా రు, ఇతర పనులు చేసి సంపాదిం చుకునేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇలాంటి వా రిని నియంత్రించేం దుకు కొత్త రూల్స్ అమల్లో కి తేవాలని ట్రంప్ సర్కారు నిర్ణయిం చింది.

నిషేధం కూడా..

అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తిరిగి స్వదే- శాలకు పంపిం చేయడం తెలిసిం దే. అలాంటి వా రు తిరిగి కొం తకాలం పాటు అమెరికాకు రాకుం డా నిషేధం పెడుతుంటా రు. తాజాగా కొత్త రూల్స్ లోనూ బాం డ్స్ తోపాటు అలాంటి నిషేధం కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే వీసా టైం ముగిసి న తర్వా త ఎన్ని రోజుల పాటు ఉన్నా రన్నదా-న్ని బట్టి నిషేధించే టైం ఆధారపడి ఉంటుం ది. కనీసం వారం రోజుల నుంచి , గరిష్టం గా 180 రోజుల వరకు ఉల్లం ఘనకు.. మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుం ది.

ఫార్మిం గ్టన్ గొడవ నేపథ్యం లో..

అమెరికా ఫెడరల్ పోలీసులు కొద్ది నెలల కిం ద ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరిట ఉత్తుత్తి వర్సిటీ పెట్టి స్టింగ్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిం దే. అమెరికాలో అక్రమంగా ఉండేం దుకు ప్రయత్ని స్తున్నవారికి గాలం వేసేం దుకు ఆ ప్రయత్నం చేశారు. దానిపై తీవ్రంగా నిరసన వ్యక్తం కావడం, పెద్ద సంఖ్యలో విదేశీయులు అమెరికాలో ఉండిపోయేందుకు అక్రమ మార్గాలు అన్వేషి స్తున్నట్టుగా గుర్తించడంతో.. ట్రంప్ సర్కారు కొత్త మార్గం పట్టిం ది. వివిధ వీసాలపై అమెరికాకు వస్తున్నవారు గడువు అయిపోయిన వెంటనే వె ళ్లిపోయేలా చర్యలు చేపట్టాలని దాదాపు ఆరు నెలల కింద హోం ల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలను ఆదేశించింది. తాజాగా మె మోను జారీ చేసింది.

కొన్ని దేశాలపైనే ఎక్కువ ఎఫెక్ట్

ఏ దేశాల నుంచి వస్తున్న బీ1, బీ2 వీసా హోల్డర్లలో 10 శాతం మందికంటే ఎక్కువగా అమెరికాలో ఉండిపోతున్నా రో గుర్తించాలని ట్రంప్ సర్కారు విదేశాం గ శాఖను ఆదేశిం చింది. ఆయా దేశాల ప్రభుత్వాలతో మాట్లాడాలని సూ చించింది. అలా ఎక్కువ శాతం ఉండిపోతున్న దేశాల వా రికి అసలు వీసాలు ఇవ్వడం నిలిపేయడం, వీసా గడువును తగ్గించడం, వా రికి సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు అడగడం, జమానతు బాం డ్ సమర్పిం చడం వంటి చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని కోరిం ది. 2018 లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్, అంగోలా , బురుం డి, కాబోవెర్డె , చాడ్, కాంగో , జిబౌటీ, ఎరిట్రియా, జార్జియా, యెమెన్, సి రియా, నైజీరియా, దక్షిణ సూ డాన్, లైబీరియా, భూటాన్, సో మాలియా, సూ డాన్ తదితర దేశాలకు చెం దిన వీసా హోల్డర్లలో 10 శాతానికి మించి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా రు. 10 శాతానికి మించి వీసా హోల్డర్లు అక్రమంగా ఉంటున్న దేశాలపై చర్యలు తీసుకోవాలన్న రూల్ తో  పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నా రు. ఉదాహరణకు ఈ లిస్టులో ఉన్న జిబౌటీ నుంచి 403 మంది అమెరికాకు వె ళ్లగా 180 మంది, చాడ్ కు చెం దిన 510 మందిలో 165 మంది వీసా గడువు ముగిసి నా అమెరికాలో ఉండిపోయారు. అంటే ఈ దేశాల నుంచి వె ళ్లిన వారిలో 30 శాతానికిపైగానే అక్రమంగా ఉంటున్నారు. ఆ దేశాలపై చర్యలు తీసుకుం టే.. కేవలం కొన్ని వందల మందిపై ఎఫెక్ట్ పడుతుం ది.

ఎవరెవరికి ఇబ్బంది?

ట్రంప్ సర్కారు జారీ చేసిన మెమో ప్రకారం… అన్ని రకాల నాన్– ఇమిగ్రెంట్ వీసాలపై అమెరికా వెళ్లేవారు తప్పనిసరిగా బాండ్ సమర్పించాలి. టూరిస్టు (బీ1), బిజినెస్ (బీ2), స్టూ డెంట్ (ఎఫ్) వీసాలపై వెళ్లేవా రిపై ప్రభావం పడుతుంది . ‘‘కొన్ని రకాల జాబ్ వీసాలపై వచ్చేవారు, వారి డిపెండెంట్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముంది . వీటిని అడ్మిష న్ బాండ్లు గా.. అంటే అమెరికాలోకి వచ్చే అనుమతి కోసం తీసుకునే బాండ్లు గా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ విధానాన్ని విస్తృతం చేసే చాన్స్​ ఉంది ”అని కాలిఫోర్నియాకు చెందిన ఇమిగ్రేషన్ లాయర్ మిషెల్​ వెక్స్​లర్ చెప్పారు.

ఇండియన్లపై ఎఫెక్ట్​ ఎంత?

అ మెరికాలో చదువుకునేం దుకు వె ళ్లే చాలా మంది ఇండియన్ స్టూ డెంట్లు వీసా టైం అయిపోయిన తర్వా త కూడా అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటా రు. 2017 ఏడాదిలో చదువు పూర్తి చేసుకుని వె ళ్లిపోవాల్సి ఇండియన్ స్టూ డెంట్లు లక్షా 27 వేల మందికాగా.. అందులో సుమారు ఐదు వేల మందికిపైగా అక్కడి ఉండిపోయినట్టు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇక 2018 ఏడాది లెక్కల ప్రకారం.. అమెరికాలో లక్షా 96 వేల మంది ఇండియన్ స్టూ డెంట్లు చదువుకుం టున్నారు. తిరిగి వె ళ్లిపోవాల్సి న, ఉండిపోయిన వా రి లెక్కలు ఇంకా తేలలేదు. ఈసారి మరో ఐదారు వేల మందికిపైగానే ఉండిపోయి ఉంటారని అంచనా. ఇలాంటి వా రందరిపై నిషేధం వేటు పడే అవకాశం ఉంటుం ది. పది శాతానికిపైగా వీసా హోల్డర్లు గడువును మించి ఉంటున్న దేశాలకు ‘జమానతు బాం డ్’ను తప్పనిసరిగా వర్తింపజేయాలన్న ఆలోచన ఉండటంతో.. ఇది ఇండియన్లపై ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అమెరికాకు వెళు తున్న, అక్కడే ఉంటున్న ఇండియన్లలో వీసా గడువు ముగిసి నా.. ఉండిపోతున్నవారు కేవలం ఒకటిన్నర శాతం వరకే ఉంటారని లెక్కలు చెబుతున్నా యి. అదే కేవలం టూరిస్టు, స్టూ డెంట్ వీసాల వా రీగా చూస్తే నాలుగు శాతం మంది వరకు ఉంటున్నారు. దీంతో ఇండియాకు సంబంధించి టూరిస్టు, స్టూ డెంట్ వీసాలకు బాం డ్ తప్పనిసరి చేసే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నా యి. ఇదే జరిగితే ఇండియన్లపై భారం పడుతుంది. సా ఫ్ట్ వేర్, ఇతర నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించి హెచ్ 1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న వా రిలో ఇండియన్లే ఎక్కువ. ఈ వీసాలపై వె ళ్లేవా రు బాం డ్ ఇవ్వాలా , లేదా అన్నదానిపై స్పష్ట త లేదు. ట్రంప్ సర్కారు ఇచ్చి న మె మోలో బీ1, బీ2, ఎఫ్ వీసాలతోపాటు ఇతర ‘నాన్ –ఇమిగ్రెంట్ వీసా’లు అని పేర్కొన్నా రు. హెచ్ 1బీ వీసా కూడా నాన్ – ఇమిగ్రెం ట్ వీసా కిందకే వస్తుందని, వా రికి కూడా బాం డ్ నిబంధన వర్తిస్తుందని అభిప్రాయపడుతున్నా రు.

Latest Updates