ఢిల్లీలోని పాక్ హై కమిషనరేట్ దగ్గర సెక్యూరిటీ టైట్

ఢిల్లీ : జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనరేట్ దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని ఇటు కేంద్రం అంటోంది. అటు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో.. పాకిస్థాన్ హైకమిషనరేట్ పై ఎవరైనా దాడిచేయొచ్చేమో అన్నఉద్దేశంతో సెక్యూరిటీని పెంచాలని ఆ దేశం భారత ప్రభుత్వాన్ని కోరింది. దీంతో…అక్కడ బందోబస్తు పెంచారు.

Latest Updates