అసెంబ్లీ వద్ద 800 మందితో సెక్యూరిటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగుఅసెంబ్లీ సమావేశాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వీఆర్‌‌‌‌‌‌‌‌వో, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌, ప్రజాసంఘాలు అసెంబ్లీని ముట్టడించే అవకాశాలు ఉన్నాయనే సమాచారంతో బలగాలను భారీగా మోహరించారు. సీపీ అంజనీకుమార్‌‌‌‌, జాయింట్‌‌‌‌ సీపీ విశ్వప్రసాద్‌‌‌‌ సోమవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఏబీవీపీ స్టూడెంట్లు అసెంబ్లీని ముట్టడించిన ఘటనతో ఈ సమావేశాలకు 800 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓయూ క్యాంపస్‌‌‌‌ ఎన్‌‌‌‌సీసీ గేట్‌‌‌‌తోపాటు అసెంబ్లీ వద్ద సెక్యూరిటీని సీపీ సమీక్షించారు.

బందోబస్తులో ముగ్గురికి కరోనా

అసెంబ్లీ సెక్రెటరీ నుంచి పర్మిషన్‌‌‌‌ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. కరోనా రూల్స్‌‌‌‌కి అనుగుణంగా డ్యూటీలో ఉన్న పోలీసులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు పోలీసులకు పాజిటివ్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ రావడంతో క్వారంటైన్‌‌‌‌కి తరలించారు. అసెంబ్లీకి మూడు కిలోమీటర్ల పరిధిలో144 సెక్షన్ అమల్లోని తెచ్చారు.  గన్‌‌‌‌పార్క్‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ స్ట్యాట్యూ, సెక్రటేరియట్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో సెక్యూరిటీ పెంచారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఐబీ, ఎస్‌‌‌‌బీ, టాస్క్‌‌‌‌ఫోర్స్ సిబ్బందిని బందోబస్తులో వినియోగిస్తున్నారు.

వీఆర్వో వ్యవస్థ రద్దుకు కేబినెట్ ఆమోదం

 

Latest Updates