180 కోట్ల పిక్సెల్స్​తో మార్స్​ ఫొటో

  • మాస్ట్​క్యామ్​తో క్లిక్​మనిపించిన క్యూరియాసిటీ రోవర్​
  • 360 డిగ్రీల వ్యూతో తొలిఫొటో
  • క్లారిటీగా అల్లంత దూరంలోని ఒక్కొక్క డిటెయిల్​

ఒక కెమెరా పవర్​ను డిసైడ్​ చేసేది పిక్సెల్స్​. అది ఎంత ఎక్కువుంటే ఫొటోలో డిటెయిల్స్​ అంత క్లియర్​గా కనిపిస్తాయి. మార్స్​పై తిరుగుతున్న క్యూరియాసిటీ రోవర్​ అట్లాంటి ఒక ఫొటోనే తీసింది. ఒకటి కాదు.. పదులు వందలు కాదు.. లక్షలూ కాదు.. కొన్ని కోట్ల పిక్సెల్స్​ ఉన్న కెమెరా ఓ ఫొటోను తీస్తే ఎట్లా ఉంటది. ఇదిగో ఇలా ఉంటుంది. రోవర్​పై ఉన్న బోల్టులు, దానిపై రాసిన రాతలు, మార్స్​పై అల్లంత దూరాన ఉన్న కొండలు, ఆ కొండల్లోని గోతులు, లోయలు, అంతెందుకు ఆ రోవర్​ టైర్​ అచ్చులూ కనిపిస్తాయి. అవును పోయినేడాది నవంబర్​ 24 నుంచి డిసెంబర్​ 1 వరకు క్యూరియాసిటీ 180 కోట్ల పిక్సెల్స్​తో మార్స్​ పనోరమిక్​ ఫొటోలను క్యాప్చర్​ చేసింది. రోవర్​కు పెట్టిన మాస్ట్​కెమెరా (మాస్ట్​క్యామ్​) అంగారక గ్రహాన్ని వెయ్యి ఫొటోలు తీసింది. ఆ ఫొటోలన్నింటినీ ఒక దగ్గర పేర్చి ఇంత పర్​ఫెక్ట్​ ఫొటోను అందించింది. అంతేకాదు, తక్కువలో తక్కువ 65 కోట్ల పిక్సెల్స్​తోనూ మరో పనరోమిక్​ ఫొటోనూ తీసింది. మార్స్​పై ఉన్న మౌంట్​ షార్ప్​కు పక్కనుండే గ్లెన్​ టొరిడోన్​ అనే ప్రాంతాన్ని ఆ రెండు పనోరమాల్లో లాక్​ చేసింది. 360 డిగ్రీల వ్యూతో మార్స్​ను కళ్లకు కట్టింది. ఇలా 360 డిగ్రీల వ్యూతో మార్స్​ను రోవర్​ క్లిక్​మనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, అంతకుముందు 2013లో ఇదే క్యూరియాసిటీ రోవర్​ 130 కోట్ల పిక్సెల్స్​తో పనోరమిక్​ మోడ్​లో మార్స్​ను చూపించింది.

పర్సివరెన్స్​.. కొత్త రోవర్​ పేరిది

ప్రస్తుతం మార్స్​పై పని చేస్తున్నది ఒక్క క్యూరియాసిటీ రోవర్​ మాత్రమే. పోయినేడాదే ఇంకో రోవర్​ ఆపర్చునిటీ తన పని నుంచి రిటైర్​ అయిపోయి రెస్ట్​ తీసుకుంటోంది. దీంతో ఈ ఏడాది ఇంకో రోవర్​ను మార్స్​పైకి పంపించేందుకు నాసా రెడీ అవుతోంది. దానికి పేరు పెట్టాల్సిందిగా స్కూల్​ స్టూడెంట్స్​కు అవకాశం ఇచ్చింది. 28 వేలకు పైగా పేర్లను స్టూడెంట్లు సూచించారు. అందులో వర్జీనియాకు చెందిన ఏడో తరగతి స్టూడెంట్​ అలెగ్జాండర్​ మాథర్​ సూచించిన పర్సివరెన్స్​ పేరును రోవర్​కు ఖరారు చేసింది. పోటీల్లో భాగంగా టాప్​ టెన్​ పేర్లను ఫైనల్​కు తీసుకున్న నాసా, అందులో నుంచి మిషన్​కు సరిగ్గా సరిపోతుందంటూ పర్సివరెన్స్​కు ఓటేసింది. ఫైనల్​ టాప్​ టెన్​లో నిలిచిన పేర్లు ఎండ్యూరెన్స్​, టెనాసిటీ, ప్రామిస్​, విజన్​, క్లారిటీ, ఇంజెన్యుటీ, ఫోర్టిట్యూడ్​, కరేజ్​. ఇక, ఈ ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 5 మధ్య ప్రయోగాన్ని నిర్వహించబోతున్నట్టు నాసా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న మార్స్​పై జెజెరో క్రేటర్​లో పర్సివరెన్స్​ను ల్యాండ్​ చేస్తామని చెప్పింది. ఒక మార్స్​ ఏడాది పాటు (భూమిపై 687 రోజులు) అది పనిచేస్తుందని తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్​ కెనవెరల్​ ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​ నుంచి ప్రయోగం చేస్తున్నట్టు వెల్లడించింది

Latest Updates