
చేతులెత్తేసిన సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
వానలతో విత్తన పంటకు డ్యామేజ్
రైతులు సొంత విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాలని సూచన
ఇతర రాష్ర్టాల్లోనూ సీడ్లేదని ప్రభుత్వానికి రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్‌కు రైతులకు సోయా సీడ్ఇయ్యలేమని రాష్ర్ట విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ ఎస్డీసీ) చేతులేత్తెసింది. అక్టోబర్‌లో కురిసిన వానలకు విత్తన పంట పూర్తిగా దెబ్బతిన్నదని, దీంతో సీడ్ దిగుబడి, నాణ్యత తగ్గిందనితెలిపింది. కొన్ని ప్రైవేట్కంపెనీలతో అగ్రిమెంట్చేసుకున్నప్పటికీ వాటి నుంచి కూడా సీడ్స్ వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. దీంతో 2021 ఖరీఫ్‌లో రైతులు తమ సొంత విత్తనాలే వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ఇచ్చింది. తాజాగా కేంద్రం కూడా వివిధ రాష్ర్టాల్లో సోయా విత్తనం ఎక్కడెక్కడ అందుబాటులో ఉందనే ఇన్ఫర్మేషన్కోరడం గమనార్హం. వర్షాలతో పంటలు దెబ్బతినడంతో, అన్ని రాష్ర్టాల్లోనూ సోయా సీడ్‌కు ఫుల్డిమాండ్ఏర్పడింది. దీంతో వచ్చే ఖరీఫ్‌లో సోయా రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
400 క్వింటాళ్లే వచ్చింది..
రాష్ర్టంలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో సోయాబీన్సాగవుతోంది. ఏటా యావరేజ్ గా మూడున్నర లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. దీనికి సంబంధించిన సీడ్స్‌ను టీఎస్ఎస్డీసీ సప్లయ్ చేస్తుంది. సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్కంపెనీలు కూడా విత్తనోత్పత్తి చేపట్టాయి. కార్పొరేషన్ 3,750 ఎకరాల్లో సాగు చేపట్టి 31,500 క్వింటాళ్ల విత్తనాలను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే కోత సమయంలోనే రాష్ర్టంలో విపరీతమైన వర్షాలు కురిశాయి. దీంతో దిగుబడి తగ్గి400 క్వింటాళ్లే వచ్చింది. ప్రీ టెండర్దక్కించుకున్న ప్రైవేటు కంపెనీలు జేఎస్335 వెరైటీ 1.10 లక్షల క్వింటాళ్లు సరఫరా చేస్తామని ఒప్పుకున్నాయి. అయితే పది కంపెనీలకు ఒకదాని నుంచే 2,500 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మిగతా కంపెనీల నుంచి స్పందనే లేదు. ఒకవేళ ఏ కంపెనీ అయినా ముందుకొస్తే జర్మినేషన్ను కచ్చితంగా చూసుకునే తీసుకోవాల్సి ఉంటుందని, ఇపుడున్న పరిస్థితుల్లో నాణ్యమైన సీడ్వచ్చేది కష్టమేనని సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ర్ట వంటి ఇతర రాష్ర్టాల్లోనూ సోయా సీడ్‌కు విపరీతమైన డిమాండ్ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొంది.
పని తక్కువ… మంచి లాభాలు
ఇతర పంటలతో చూస్తే సోయా పంటకు తక్కువ పని ఉంటుంది. వాతావరణం అనుకూలించి పంట మంచిగా సాగైతే దిగుబడులు కూడా ఎక్కువనే వస్తయి. దీంతోనే నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు సోయాను ఎక్కువ సాగు చేస్తారు. ఇప్పుడిప్పుడే ఇతర జిల్లాల్లోనూ ఈ పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం క్వింటా సోయాకు రూ.3,880 చొప్పున ఎంఎస్పీ ఇస్తోంది. అయితే క్వింటాకు రూ.10 వేలు పెట్టినా నాణ్యమైన విత్తనాలు దొరికే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నరు.
For More News..