
ఆగస్టులోనే నిర్వహిస్తామన్నా ఇప్పటికీ దిక్కులేదు
ఫండ్స్లేక పెండింగ్ పడిన సివిల్ వర్క్స్
వచ్చే నెలలో డ్రై రన్ అంటున్న మినిస్టర్
రైతులకు ఈ సీజన్లోనూ ఎదురుచూపులే
ఖమ్మం, వెలుగు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు గోదావరిపై చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డ్రై రన్ఇంకా లేటయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు నాటికి డ్రై రన్పూర్తి చేసి, 2020 డిసెంబర్ నెలాఖరుకల్లా సాగు, తాగునీరు అందిస్తామని గతేడాది జూన్‌లో సర్కారు ప్రకటించినా సాధ్యం కాలేదు. దాదాపు 6 నెలలుగా సర్కారు రూ.700 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో కాంట్రాక్టర్లు సివిల్ వర్క్‌లు ఆపేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో డ్రై రన్నిర్వహిస్తామని మినిస్టర్ అజయ్చెబుతున్నప్పటికీ రైతులకు ఈ సీజన్లోనూ ఎదురుచూపులు తప్పేలా లేవు.
గడువు దాటిపోతున్నా పనులు కావట్లే..
గతేడాది జూన్‌లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్, సీఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్ తో కలిసి సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆగస్టు నాటికి డ్రై రన్ నిర్వహిస్తామని, 2020 డిసెంబర్ నెలాఖరు నాటికి సాగు, తాగునీరు అందిస్తామని ఇద్దరూ ప్రకటించారు. అప్పటికే కరోనా లాక్ డౌన్ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, పనులు వేగంగా కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే గడువు ముగిసి ఆర్నెళ్లు అవుతున్నా ఇప్పటివరకు డ్రై రన్సాధ్యం కాలేదు. దీంతో సాగు, తాగునీటి విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. చైనా నుంచి రావాల్సిన మెటీరియల్ లాక్డౌన్ కారణంగా ఆలస్యం కావడం, కరోనాతో ఇతర రాష్ట్రాల లేబర్వెళ్లిపోవడం, పంప్ హౌస్‌లలో మిషనరీ ఫిట్టింగ్ కు ఎక్స్ పర్ట్స్ రాకపోవడం వంటి కారణాల వల్ల అనుకున్న టైం కంటే లేటవుతోందని ఆఫీసర్లు చెబుతున్నా అసలు కారణం ఫండ్స్ లేకపోవడమేనని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
రూ.700 కోట్లు పెండింగ్
సీతారామ ప్రాజెక్టుకు ఫండ్స్ఇన్టైంలో రావట్లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. దాదాపు 6 నెలల నుంచి సివిల్ వర్క్ లకు సంబంధించిన రూ.700 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం డీజిల్ బిల్లులు మాత్రమే ఇస్తుండడంతో డబ్బులు రొటేషన్ చేయలేక పనులు కొనసాగించలేకపోతున్నామని అంటున్నారు. దీంతో కొద్ది నెలలుగా సివిల్ వర్క్స్నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ను కలవాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు పంప్ హౌస్‌ల డ్రై రన్కూడా ఆలస్యమవుతోంది. పంప్ హౌస్‌లలో మిషనరీ, ఎలక్ట్రికల్ పనులకు ఫండ్స్సమస్య లేదని, సివిల్ వర్క్ లకు సంబంధించిన ఫండ్స్కోసం బ్యాంకుల టై అప్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి డ్రై రన్ నిర్వహించడానికి మరికొన్ని నెలలు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రాజెక్టు ప్రోగ్రెస్ ఇలా..
రూ.13 వేల కోట్ల అంచనాతో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు గోదావరిపై సీతారామ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల విలువైన పనులు జరిగాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గోదావరి నీటిని కాల్వల ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు తరలిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు దాదాపు 3 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. దుమ్ముగూడెం నుంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా 372 కిలోమీటర్ల మేర నీటిని కాల్వల ద్వారా తరలించనున్నారు. ఇక క్రాస్స్ట్రక్చర్లు మొత్తం 155 ఉండగా, ఇప్పటివరకు 141 చోట్ల పనులు ప్రారంభించారు. ఇందులో 86 చోట్ల పనులు పూర్తయ్యాయి. మొత్తం 44 లక్షల స్క్వేర్మీటర్ల సిమెంట్ లైనింగ్ పనులకుగాను ప్రస్తుతం 24 లక్షల స్క్వేర్మీటర్లు లైనింగ్ కంప్లీట్ అయ్యాయి.
సీఎం చేతులమీదుగా డ్రై రన్
మూడు పంప్ హౌస్ లకుగాను రెండు పంప్ హౌస్ లు ప్రస్తుతం డ్రై రన్ కు సిద్ధంగా ఉన్నాయి. మరో పంప్ హౌస్ కూడా నెలాఖరులోగా డ్రై రన్ కు రెడీ అవుతుంది. సీతమ్మ బ్యారేజీ శంకుస్థాపన, సీతారామ డ్రై రన్ ఒకేసారి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. దీనిపై సీఎం కేసీఆర్ నుంచి టైమ్ తీసుకున్న తర్వాత తేదీ నిర్ణయిస్తాం. కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రెండు, మూడు నెలల్లో క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి