‘సీత’ రివ్యూ

రివ్యూ: సీత

రన్ టైమ్: 2 గంటల 41 నిమిషాలు

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్,సోనూ సూద్,మన్నెరా చోప్రా,తనికెళ్ల భరణి,అభినవ్ గోమటం,భాగ్యరాజా,కోట శ్రీనివాసరావు తదితరులు

సినిమోటోగ్రఫీ: సిర్శా రే

మ్యూజిక్: అనూప్

మాటలు : లక్ష్మీ భూపాల్

నిర్మాతలు : ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్

కథ,కథనం,దర్శకత్వం: తేజ

రిలీజ్ డేట్: మే 24,2019

కథేంటి?

సీత (కాజల్) డేరింగ్ విమెన్.డబ్బు, స్టేటస్ కోసం ఏమైనా చేస్తుంది.బంధాలు,బాందవ్యాలు తనకు ముఖ్యం కాదు.ఓ ల్యాండ్ కేసు విషయంలో తన పనికావడానికి ఎమ్మేల్యే బస్వరాజ్ (సోనూ సూద్) తో కమిట్ అవుతానని అగ్రిమెంట్ మీద సైన్ చేసి తర్వాత బుకాయిస్తుంది.కానీ బస్వరాజ్ సీరియస్ గా తీసుకొని తన వెంటపడతాడు.దాన్ని వదిలించుకోవడానికి తన తండ్రి ఆస్తి కోసం వెళితే అదంతా అమయాకుడైన రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) పేరు మీద రాసి తన తండ్రి చనిపోతాడు.ఆ ఆస్తి రామ్ నుంచి సీత ఎలా లాక్కుంటుందనేదే కథ.

నటీనటుల పర్శార్మెన్స్:

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు నటనలో మెరుగవుతున్నాడు.ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో బాగా చేశాడు.నెగటివ్ షేడ్ లో కాజల్ అగర్వాల్ తన పాత్ర లొ ఒదిగిపోయింది.తన కెరీర్ లో చేసిన కొన్ని మంచి పాత్రలలో ఈ సీత క్యారెక్టర్ నిలుస్తుంది.సోనూ సూద్ పాత్ర చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది.ఆ పాత్రలో ఆయన రాణించాడు.హీరోయిన్ పీ.ఎ గా అభినవ్ గోమటం నటన బాగుంది.మన్నెరా చోప్రా తన నటనతో కాస్త విసిగిస్తుంది. తనికెళ్ల భరణి విలన్ పక్కన పంచ్ లు వేస్తూ ఆకట్టుకుంటాడు.

టెక్నికల్ వర్క్:

సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.భూటాన్ అందాలను బాగా చూపించారు.అనూప్ ఇచ్చిన పాటలేవి వినసొంపుగా లేవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.అనవసరపు సీన్లకు కత్తెరపడాల్సింది.ఆర్ట్ వర్క్,యాక్షన్ అంతా బాగుంది.ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి.లక్ష్మీ భూపాల్ డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘నేనే రాజు నేనే మంత్రి’’ తో మళ్లీ ఫామ్ లో కొచ్చాడనుకున్న డైరెక్టర్ తేజ ఈ సారి మోడ్రన్ ‘‘సీత’’ కథ ను ఆడియన్స్ కు చెప్పే ప్రయత్నం చేశాడు.ఫస్టాఫ్ ఎంటర్ టైన్మెంట్ తో ఫర్వాలేదనిపించిన ‘‘సీత’’ సెకండాఫ్ లో మాత్రం బోర్ కొట్టించింది.అనవసరమైన డ్రాగ్ లతో కథనం గతితప్పి మిస్ ఫైర్ అయింది.తేజ ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్ గానే అనిపించినా.. చివరికి వచ్చేసరికి రొటీన్ ట్రీట్ మెంట్ వల్ల విసుగుపుడుతుంది.

కొన్ని లాజిక్ లేని సీన్ల వల్ల సినిమా గాడి తప్పింది.ముఖ్యంగా క్లైమాక్స్ ను మరీ డ్రాగ్ చేసారు.అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో మరో క్లైమాక్స్ లాంటి ఎపిసోడ్ పెట్టడం వల్ల థియేటర్ల నుండి పరుగులు పెట్టాలనిపిస్తుంది.ఊహించిన ముగింపే అయినపుడు తొందరగా క్లోజ్ చేయాల్సింది.తేజ సెటప్ చేసుకున్న క్యారెక్టర్లు,కథ ఇంట్రెస్టింగే అనిపించినా..దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి.ఓవరాల్ గా ‘‘సీత’’ పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం చేయదు.

బాటమ్ లైన్: ‘‘సీత’’ కష్టాలు

Latest Updates