హీరోయిన్ గా సీతమ్మ వాకిట్లో ఫేమ్ తేజస్వి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకి చెల్లెలిగా నటించి అందర్నీ ఆకట్టుకున్నఅచ్చతెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. తర్వాత చాలా చిత్రాల్లో యాక్ట్ చేసింది. నటన పరంగాను, గ్లామర్ పరంగాను మార్కులు వేయించుకున్నా ఆశించినంత పేరైతే రాలేదు. హీరోయిన్‌ గా సక్సెస్ కావాలని గట్టి ప్రయత్నాలే చేసినా అవేమీ సరైన ఫలితాన్నివ్వలేదు. దాంతో కాస్త వెనకబడింది. గ్లామరస్‌‌గా కనిపించడంలో తెలుగమ్మాయిలు ఎవరికీ తీసిపోరు అని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసే తేజస్వి.. ఇప్పుడు తన సినిమాతో కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేయనుంది. శుక్రవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ ‘కమిట్మెంట్’ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్‌‌‌‌లో చాలా గ్లామరస్‌‌గా, ఇంకా చెప్పాలంటే బోల్డ్‌ గా కనిపిస్తోందామె. ఈ స్టోరీ, అందులో తేజస్వి రోల్ కూడా కాస్త బోల్డ్‌ గానే ఉంటాయని టాక్. ‘హైదరాబాద్‌ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. హీరోయిన్లుగా వెలుగొందాలని ఇండస్ట్రీకి వచ్చే నలుగురు అమ్మాయిలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చూపించనున్నారు . ఈ సినిమా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. తేజస్వితో పాటు రమ్య పసుపులేటి, సిమర్ సింగ్, అన్వేషి జైన్ లీడ్‌ రోల్స్‌‌ చేస్తున్నారు.

Latest Updates