ఏపీలో భారీగా నగదు, లిక్కర్ సీజ్

ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బరి తెగిస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాలకు తెర తీశాయి. ఓటర్లకు నోట్ల కట్టలు వెదజల్లుతున్నాయి. లిక్కర్ ను భారీగా పంపిణీ చేస్తున్నాయి. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా నగదు, లిక్కర్ పట్టుబడుతోంది.

కృష్ణా  జిల్లా ముసునూరులో ఏకంగా వాటర్ ట్యాంకర్ లో లిక్కర్ దాచిపెట్టారు. పోలీసులు తనిఖీలు చేయగా.. వెయ్యి 75 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంచికచర్లలోనూ లిక్కర్ బయటపడింది. ఓ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులు.. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates