శ‌ంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా ప‌ట్టుబ‌డ్డ‌ బంగారం

హైదరాబాద్: శ‌ంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి హైద‌రాబాద్ కు అక్ర‌మం త‌ర‌లిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. రియాద్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 837 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.45 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్యాంట్ జేబులో బంగారు బిస్కెట్లను అమర్చి తీసుకొస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి వస్తున్న నలుగురు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేయగా.. వారి జేబుల్లో 837 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు కస్టమ్స్‌ అధికారులు.

Latest Updates