పెద్దఅంబర్‌పేట దగ్గర ఆవులు తరలిస్తున్న వాహనం పట్టివేత
V6 Velugu Posted on Jan 29, 2022
రంగారెడ్డి: అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని పెద్దఅంబర్ పేట దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. డీసీఎం డ్రైవర్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆవులను ఆలేటి ఆశ్రమ గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Tagged Hyderabad, seizure, vehicle, cows, , transporting