కృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం లారీ పట్టివేత

కృష్ణాజిల్లా: తెలంగాణ నుండి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యం లారీని పోలీసులు పట్టుకున్నారు.  విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద పెద్ద ఎత్తున త్తెలంగాణ మద్యం పట్టుపడింది. ఏపీలో తెలంగాణ కంటే మద్యం ధరలు 75 శాతం వరకు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అక్రమార్కులు తెలంగాణ సరిహద్దులో నుండి ఏపీలోకి అనేక మార్గాల్లో అక్రమంగా మద్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు పోలీసుల తనిఖీల్లో మద్యం బాటిళ్లు పట్టుపడుతూనే ఉన్నాయి. అయితే   వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద హైదరాబాద్ వైపు నుండి వస్తున్న లారీలో మొత్తం లోడ్ మద్యం బాటిళ్లే కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. లారీ డ్రైవర్ వద్ద ఉన్న పత్రాలన్నీ నకిలీవిగా తేలింది. నకిలీ పత్రాలు తయారు చేసుకుని వాటి సహాయంతో అక్రమంగా మద్యం తరలించి సొమ్ము చేసుకుందామనుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. డ్రైవర్ తోపాటు.. మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Latest Updates