కేవలం 15 మందితో శేఖర్ కమ్ముల-నాగచైతన్య సినిమా షూటింగ్

టాలీవుడ్‌ స్టార్స్‌ లో ముందుగా మేకప్ వేసుకుంది నాగార్జున. ‘బిగ్‌ బాస్‌ 4’తో పాటు ‘వైల్డ్ డాగ్‌ ‘షూటింగ్‌ లోనూ పాల్గొన్నారాయన. నాన్న బాటలోనే నాగచైతన్య కూడా ‘లవ్‌ స్టోరీ’ షూటింగ్‌ లో జాయినయ్యాడు. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. లాక్‌‌‌‌డౌన్‌ కి ముందే మేజర్‌‌‌‌‌‌‌‌ పార్ట్ పూర్తయింది. రెండు వారాల బ్యాలెన్స్ వర్క్ మిగిలుంది. సోమవారం నుండి ఆ వర్క్ ప్రారంభించారు. ఎంత చిన్న సినిమా అయినా మినిమమ్ యాభై మంది లేనిదే షూటింగ్ చేయడం కష్టం. కానీ కేవలం పదిహేను మందితో ఈ సినిమా షూట్ చేస్తుండటం విశేషం. అన్నిరకాల కోవిడ్ రూల్స్‌ ని పాటిస్తూ సింగిల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌లో కంప్లీట్ చేస్తామని టీమ్ చెబుతోంది. నారాయణదాస్ నారంగ్, రామ్‌‌‌‌మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ మూవీ వీలైతే దసరాకి లేదంటే డిసెంబర్‌‌‌‌లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Latest Updates