ఈ నెల 27న మేయర్లు, చైర్మన్ల ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జనవరి 27న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత కొత్త పాలక మండలి తొలి సమావేశం జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ పరోక్ష ఎన్నికలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.

నిన్న(బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 25న వెలువడనున్నాయి.

Latest Updates