గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్ కుమార్. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు 31, సెకండరీ స్కూల్స్ లో 1513 డిఫెన్స్ క్లాసులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోటీ 38లక్షల 96వేల రూపాయలను సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులకోసం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ స్కూల్ కు 9వేల రూపాయల కెటాయింపు జరుగుతదని తెలిపారు. ట్రైనర్ కు మూడు వేల జీతం, వారంకు రెండు రోజుల పాటు క్లాసులు జరుగుతాయని చెప్పారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడునెలలు శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు.

Latest Updates