అమ్మాయిలకు సెల్ఫ్​ డిఫెన్స్​ క్లాసులు

1,544 సర్కారీ స్కూళ్లలో 3 నెలల శిక్షణ

హైదరాబాద్​, వెలుగు: సర్కారు బడుల్లో ఆడపిల్లలకు సెల్ఫ్​ డిఫెన్స్​ క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వంద మంది అమ్మాయిల కన్నా ఎక్కువున్న 1,544 స్కూళ్లలో ట్రైనింగ్​ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​​విజయ్​​కుమార్​​ తెలిపారు. ఫిబ్రవరి వరకు 3 నెలలపాటు 31 అప్పర్ ​​ప్రైమరీ స్కూళ్లు, 1,513 హైస్కూళ్లలో శిక్షణ ఇస్తామన్నారు. కరాటే, కుంగ్ఫూ, మార్షల్​ ఆర్ట్స్​, జూడో ట్రైనింగ్​ ఇచ్చేందుకు జిల్లా స్పోర్ట్స్​ అధికారులతో మాట్లాడాల్సిందిగా ఆయా స్కూళ్ల హెడ్​మాస్టర్లకు సూచించారు. వారంలో 2 రోజులు మధ్యాహ్నం క్లాసులు పెట్టేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సెల్ఫ్​ డిఫెన్స్​ క్లాసుల కోసం ఒక్కో స్కూల్​కు రూ. 9వేల చొప్పున 1.38 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 Self Defense Classes for Girls in Government Schools

Latest Updates