ఇస్మార్ట్​ చెత్తడబ్బా

చెత్త డబ్బాఅమెరికాలోని రెజ్జీ కంపెనీ ‘ఇస్మార్ట్ చెత్త డబ్బా’ను తయారు చేసింది. అట్లాంటిట్లాంటి ఇస్మార్ట్​ కాదండోయ్​.. డబ్బాలో చెత్తేస్తే చాలు.. దానతంట అదే చెత్త డంపింగ్ పాయింట్ వద్దకు వెళ్తుంది. అక్కడున్నోళ్లు చెత్తను ఖాళీ చేశాక ఇంటికి వస్తుంది. మనం చేయాల్సిందల్లా.. మొబైల్ యాప్​లో దీనికి సంబంధించి సెట్టింగ్స్ చేసుకోవడమే. మన ఇంటి వద్ద గార్బేజ్ పాయింట్, దగ్గర్లోని చెత్త డంపింగ్ పాయింట్, వెళ్లాల్సిన రూట్​ను సెట్ చేయాలి. ఏ రోజు, ఏ టైం లో చెత్తను వేసి రావాలి? ఫిక్స్​ చేయాలి. ఇకంతే. చెప్పిన టైంకి చెత్తను తీసుకుని ఉరుకుడే ఉరుకుడు. సెన్సర్లు, కెమెరాల సాయంతో రోడ్డుపై అడ్డంకులను తప్పించుకుంటూ ముందుకు కదులుతుంది. వచ్చే ఏడాది చివరన మార్కెట్లోకి వస్తోంది.

Latest Updates