సాయి బాబాతో మాట్లాడుతానంటూ మహిళా సన్యాసి మోసం.. అరెస్ట్

ముంబై: శిరిడీ సాయి బాబాతో డైరెక్టుగా మాట్లాడి కుటుంబ సమస్యలను, రోగాలను నయం చేస్తానంటూ ఓ మహిళను మోసం చేసింది ఓ మహిళా సన్యాసిని. ముంబై కు చెందిన కిరణ్ దారువాలా అనే మహిళ తనను తాను దైవాంశ సంభూతురాలిగా ప్రకటించుకుంది. దీంతో ఆమె దగ్గరకు తమ సమస్యలు పరిష్కరించమంటూ కొందరు కిరణ్ ను కోరేవారు. అందులో భాగంగా… ముంబైకు చెందిన 34 ఏండ్ల ఓ మహిళ కిరణ్ దారువాలాను 2016లో కలిసింది. తన అత్తమ్మకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆర్థికంగా కూడా తన కుటుంబం అంతగా బాగాలేదని తమ సమస్యలను దూరం చేయాలని కిరణ్ దారువాలాను కోరింది.

తాను శిరిడీ సాయితో మాట్లాడి బాధలను దూరం చేస్తానని ఆ మహిళకు మాట ఇచ్చింది కిరణ్ దారువాలా. పూజలు చేయడానికి ఖర్చు అవుతుందని సదరు మహిళ దగ్గర 2016 నుంచి ధనాన్ని వసూలు చేస్తూ వస్తుంది కిరణ్. ఒక సారి ఆ మహిళపై కిరణ్ కు చెందిన వాళ్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో కిరణ్ చేసే మోసాన్ని గ్రహించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం కిరణ్ దారువాలాను అరెస్ట్ చేశారు పోలీసులు. పూజలు చేస్తామన్న పేరుతో 2016 నుంచి ఇప్పటివరకు 12.75 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు చెప్పింది బాధిత మహిళ. నింధితురాలిని కోర్టులో హాజరు పర్చగా.. జులై 25 వరకు పోలీసుల కస్టడీలో ఉండాలని కోర్టు తెలిపింది.

Latest Updates