సెల్ఫీ కెమెరా కాదు ‘సై కెమెరా’.. స్మార్ట్‌ఫోన్ మీపై ఓ కన్నేస్తోంది!

పెగాసస్​.. మొన్నమొన్నటిదాకా పెద్ద దుమారాన్ని రేపిన నిఘా మాల్​వేర్​. వాట్సాప్​ వీడియో కాల్స్​ చేసి, యూజర్​ ఆ ఫోన్​ను ఎత్తకున్నా హ్యాకర్లు స్పైవేర్​ను పంపి గూఢచర్యం చేశారన్నది ఆరోపణ. ఇప్పుడు కాసేపు దాన్ని పక్కనపెడదాం. సెల్ఫీల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సెల్ఫీల మోజు అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద ఫోన్లన్నీ కూడా ఇప్పుడు కెమెరా ఫీచర్​తోనే హైలైట్​ అవుతున్నాయి. కానీ, ఆ సెల్ఫీ ముచ్చటే మనల్ని ముప్పులో పడేయొచ్చు. మనపై నిఘా పెట్టొచ్చు. అవును, సెల్ఫీ కెమెరాతోనే మనపై కొందరు హ్యాకర్లు నిఘా పంజా విసిరే ముప్పు పొంచి ఉంది. చెక్​మార్క్స్​ అనే సైబర్​ సెక్యూరిటీ సంస్థ ఈ హెచ్చరిక చేసింది.

ఆండ్రాయిడ్​ ఫోన్లలోని సెల్ఫీ కెమెరాలు నిఘాకు వల్నరబుల్​గా మారిపోయాయని హెచ్చరించింది. శాంసంగ్​, గూగుల్​ పిక్సెల్​ ఫోన్లలోని కెమెరాలను హ్యాకర్లు తమ కంట్రోల్​లోకి తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పింది. ‘‘గూగుల్​ పిక్సెల్​ 2ఎక్స్​ఎల్​, గూగుల్  పిక్సెల్​ 3 ఫోన్లను తీసుకుని గూగుల్  కెమెరా యాప్​తో మేం రీసెర్చ్​ చేశాం. యూజర్​ పర్మిషన్​ లేకుండానే హ్యాకర్లు చొరబడిపోయేందుకు ఆ ఫోన్ల కెమెరాలు అనువుగా ఉన్నాయని తేల్చాం” అని కంపెనీ సెక్యూరిటీ రీసెర్చర్లు ఎరెజ్​యెలోన్​, పెడ్రో అంబెలినో తెలిపారు.

మన ప్రమేయం లేకుండానే ఫొటోలు, వీడియోలు

ఫోన్ల కెమెరాల్లోని సమస్యలతో హ్యాకర్లు ఈజీగా చొరబడిపోయి, ఫోన్​ ఓనర్​ ప్రమేయం లేకుండానే ఫొటోలు, వీడియోలు తీసే ముప్పు ఉందని నిపుణులు తేల్చారు. అందుకు ఓ మాల్వేర్​ అప్లికేషన్​ను హ్యాకర్లు వాడుకునే అవకాశం ఉందని చెప్పారు.

అంతేగాకుండా స్టోరేజీ పర్మిషన్​ పాలసీల్లోని తేడాల వల్ల, ఫోన్​లో దాచుకున్న ఫొటోలు, వీడియోలనూ హ్యాకర్లు దోచుకునే ముప్పుందంటున్నారు. కెమెరాలోని లొకేషన్​ సెట్టింగ్స్​, ఫొటోలపై ఉండే జీపీఎస్​ మెటాడేటా ఆధారంగా ఫోన్​ యూజర్​ లొకేషన్​నూ తెలుసుకునే ప్రమాదం ఉందంటున్నారు.

READ ALSO: రెడ్ అలెర్ట్: ఈ 40 రకాల మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు

అలర్ట్ అయిన గూగుల్

ఈ వ్యవహారంపై గూగుల్​ స్పందించింది. చెక్​మార్క్స్​ చేసిన రీసెర్చ్​ను మెచ్చుకుంది. ఫోన్లలోని లోపాలపై సరిదిద్దేందుకు గూగుల్​, యాండ్రాయిడ్​ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పింది. ఇప్పటికే ఆ ప్రభావం పడిన గూగుల్​ డివైస్​లలో సమస్యను పరిష్కరించామని తెలిపింది. జులైలో ప్లేస్టోర్​ ద్వారా గూగుల్​ కెమెరా అప్లికేషన్​కు అప్​డేట్​ ఇచ్చామని చెప్పింది. సెక్యూరిటీ ప్యాచ్​నూ తెచ్చామంది.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి.

Latest Updates