హద్దులు మీరుతున్న సెల్ఫీ పిచ్చి

సెల్ఫీ..సెల్ఫీ.. సెల్ఫీ.. ఇప్పుడు ఎక్కడైనా దీని పేరే వినిపిస్తోంది. చిన్నా, పెద్దా అనేతేడా లేదు…స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు క్షణాల్లో వందల సెల్ఫీలు ..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..లైకులు ,కామెంట్ల కోసం ఎదురు చూడటం కామన్అయిపోయింది. ఇక తమ అభిమాన తారలు కనిపిస్తే ..ఎలాగైనా సరే వాళ్లతో సెల్ఫీ తీసుకోవాల్సిందే. దాన్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిందే.

మొబైల్ చేతిలో ఉంటే చాలు… మనసుకి నచ్చింది ..మనం మెచ్చింది ఏదయినా క్యాప్చర్ చేసేయొచ్చు అనేవ్యవహార శైలి ఈ మధ్య చాలామందిలో కన్పిస్తోంది. ఇక సెల్ఫీల పాపులారిటి అయితే శ్రుతిమించుతోంది. ఈ సెల్ఫీ పిచ్చి పర్యావరణాన్ని కూడా నష్టం కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో నెదర్లాండ్ తులిప్స్​ గార్డెన్ లోఒక యువతి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ యువతి ఫొటో కోసం పూలమొక్కలను తొక్కి పడేసింది. ఐసెల్ఫీ కోసం దాదాపు వందల మొక్కలను పాడు చేసింది.

సెల్ఫీ ప్లీజ్ ’.. అనే రిక్వెస్ట్ ఇప్పుడు సినీ, గ్లామర్ రంగాల ప్రముఖులకైతే మాములైపోయింది.ఒకప్పుడు మాత్రం సెలబ్రిటీలు కనిపిస్తే వెంటపడి ఆటోగ్రాఫ్స్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు హీరో, హీరోయిన్లు కనిపించగానే సెల్ఫీ పేరుతో వారిని కెమెరాల్లో బంధిస్తున్నారు. ఒకప్పుడు అట్టముక్క నుంచి వీపు దాకా ఆటోగ్రాఫ్ కు వేదిక చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సరదా కనుమరుగవుతోంది. సెల్ఫీ క్రేజ్ఆటోగ్రాఫ్ ని వెనక్కి నెట్టింది. ఆటోగ్రాఫ్ బుక్ పట్టుకుని తిరిగిన సిటీజనులు..ఇప్పుడు సెలబ్రిటీలతో తీసుకున్న సెల్ఫీలను ఫేస్బుక్, వాట్సాప్ లోనో పోస్ట్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు.

ఆటోగ్రాఫ్ అటకెక్కింది
స్మార్ట్ ఫోన్ రాకతో ఆటోగ్రాఫ్ క్రేజ్ తగ్గింది. సెలబ్రిటీలతో ఫోటోలు దిగే ట్రెండ్ మొదలైంది. సెల్ఫీలు వచ్చేశాక ఆటోగ్రాఫ్ అటకెక్కింది. సెలబ్రిటీలతో సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్చేయడం , లైకుల్ని లెక్కేసుకోవడం ఇప్పుడులేటెస్ట్ హాబీ .

హడావుడి కొన్ని రోజులే..
ఇప్పటికీ ఆటోగ్రాఫ్స్ పై ఆసక్తి చూపే అభిమానులుఉ న్నారు. కానీ చాలా తక్కువ సంఖ్యలో.సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేలైక్స్ హడావుడి ఒక రెండు, మూడు రోజులుఉం టుం ది. సంవత్సరానికి ఒకసారి సోషల్మీడియా పోస్ట్ చేసిన ఫొటోని గుర్తుచేస్తుం ది.రెండుమూడేళ్లలో మన గ్యాలరీ నుం చి ఫొటోకనుమ రుగైనా ఆశ్యర్చపోవాల్సిన అవసరంలేదు. కానీ ఆటోగ్రాఫ్ అలా కాదు. ఆ వ్యక్తినిచూసిన ప్రతిసారి ఆటోగ్రాఫ్ ని తెరిచి చూసుకునేవాళ్లుంటా రు. గజిబిజిగా దిగిన ఫొటోలాకాకుం డా ఎప్పటికీ ఒక జ్ఙా పకంలా ఉంటుంది.

అభిమానం హద్దు దాటితే
ఆటోగ్రాఫ్ లైతే కాపీ చేసినట్టు అనుమానం ఉంటుంది. అదే సెల్ఫీ అయితే తిరుగులేని రుజువు అనడంలో సందేహం లేదంటారు కొందరు అభిమానులు. అభిమానించే వ్యక్తి కళ్లముందు ఉంటే కెమెరాలో క్యాప్చర్ చేయకుండా పెన్ను, పేపర్ కోసం వెతకడం ఎందుకు అనేది వాళ్ల ప్రశ్న? తమకు నచ్చిన స్టార్లు అంటే ఎవరికైనా అభిమానం వెల్లువెత్తుతుంది. మనమే కాదు సినీ,స్పోర్స్ట్ , పొలిటి కల్ స్టార్స్ ఎవరైనా సరే …ఇష్టపడిన వారితో ఏదో ఒక రోజు ఒక సెల్ఫీ దిగాలనుకుంటా రు. కానీ ఏదైనా మితిమీరితేమింగుడు పడదనేది తెల్సిందే. అభిమానం పేరుతో సెల్ఫీలు డిమాండ్ చేస్తూ ఫ్యాన్స్ వారల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. రోడ్ మీద, రైలు మీద, ..ఎక్కడపడితే అక్కడ జనాలకు పిచ్చెక్కించేలా, కొందరైతే చచ్చిపోయేలా సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ఇబ్బంది పెట్టేస్తోంది
సెల్ఫీ ట్రెండ్ … సెలబ్రిటీలను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. అభిమానులు కదా అని సర్దుకుపోతుంటే .. సమయం, సందర్భం మరిచి సెల్ఫీలకు పోజులిమ్మం టూ సతాయిస్తున్నారు ఫ్యాన్స్ . అలా అభిమానుల వల్ల ఇబ్బంది పడిన కొందరుతారలు సెల్ఫీ గోలపై ఇలా స్పందిం చారు…

శవాల వద్ద సెల్ఫీలా?!
అభిమానులు అంటే అమితాబ్ కు ఎంతో గౌరవం.. వాళ్లు ఏది కోరినా అమితాబ్ కాదనరు. సోషల్ మీడియాలోఅభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కూడా. కానీ సెల్ఫీల పుణ్యమాఅని .. అమితాబ్ ను అభిమానులు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తన స్నేహితుడి అంత్యక్రియలకు హాజరయిన బిగ్ బీతో సెల్ఫీలు దిగేందుకు అభిమానుల ఉత్సాహం చూపించిన ఘటన బిగ్ బీని గతంలో తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘శవాల వద్దకూడా సెల్ఫీలా.. మరణించిన వారికి కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ..’ సోషల్మీడియా వేదికగా అప్పట్లో ఆవేదన వ్యక్తంచేశారాయన.

Latest Updates