సెల్ఫీ విత్‌ IPL  ట్రోఫీ

ఓ వైపు రసవత్తర పోరాటాలతో ఐపీఎల్‌ 12వ సీజన్‌ జోరుమీదుంటే..మరోవైపు ఐపీఎల్‌ ట్రోఫీ నగరాలను చుట్టివచ్చేపనిలో ఉంది. ప్రచారంలో భాగంగా విజేతలకు బహుకరించే ట్రోఫీని లీగ్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది ఫ్రాంచైజీల ప్రధాన నగరాల్లో ప్రదర్శనకు ఉంచడం ఆనవాయితీ. అందులో భాగంగా గత నెల 17న ఢిల్లీలో ప్రారంభమైన ట్రోఫీ టూర్‌ బెంగళూరు, చెన్నై, ముంబైని చుట్టేసి తాజాగా భాగ్యనగరానికి చేరింది. సిటీలోని జీవీకే మాల్‌ లో ట్రోఫీని ప్రదర్శనకు ఉంచగా.. ఐపీఎల్‌ ప్రేమికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు . ఈ నెల 4 వరకు నగరవాసులకు అందుబాటులో ఉండనున్న ఈ ట్రోఫీ ఆ తర్వాత చండీగఢ్‌ కు పయనం కానుంది. చివరగా ఈ నెల 7న జైపూర్‌ తో ట్రోఫీ టూర్‌ ముగుస్తుంది.

 

Latest Updates