స్వార్ధ రాజకీయాలకు కేరాఫ్ అసదుద్ధీన్

ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీకి  మున్సిపల్ ఎలక్షన్స్ పై మీద ఉన్న శ్రద్ధ ముస్లింలపై లేదని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. ఆయన స్వార్ధ రాజకీయాలకు కేరాఫ్ అన్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం గుర్తించాలన్నారు. ఎంఐఎం పార్టీలో ఎవరినీ ఎదగనీయని ఓవైసీ ప్రజాస్వామ్యం,సెక్యూలరిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

హైదరాబాద్ లో ముస్లిం సంఘాలు చేసిన CAA వ్యతిరేక ప్రదర్శనకు సంఘీభావం తెలపని అసదుద్ధీన్..సీఎం కేసీఆర్ ఆహ్వానంతో సంగారెడ్డికి వెళ్లి అక్కడ మాట్లాడారన్నారు అర్వింద్. హైదరాబాద్ ప్రదర్శనలో తాను తప్ప వేరే ఎవరూ మాట్లాడకూడదనే షరతు పెట్టడమే దీనికి కారణమన్నారు. అంతేకాదు ఈ రాష్ట్ర శాంతి భద్రతలు ఓవైసీ చెప్పుచేతల్లో ఉన్నాయని ఆరోపించారు ఎంపీ అర్వింద్.

Latest Updates