బ్యాన్​ చేసిన​ చైనా యాప్స్​ను అమ్మాల్సిందే!

అమ్మకానికి రెడీ అవుతున్న కంపెనీలు
లైసెన్స్ ఫీజుల ద్వారా పేరెంట్ కంపెనీకి రెవెన్యూలు
ఇండియాలో తమ ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుంటున్న కొన్ని యాప్స్
ప్రమాదంలో వేలాది మంది జాబ్స్​

న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన చైనీస్ గేమింగ్ యాప్‌‌లు, తమ వ్యాపారాలను ఇండియన్ పార్టనర్లకు అమ్మేయాలని చూస్తున్నాయి. సంబంధిత లాయర్లు, ఆఫీసర్లు ఈ విషయాన్ని చెప్పారు. ప్రొడక్ట్‌‌ను రీలాంఛ్ చేసిన తర్వాత ఇండియన్‌‌ కంపెనీలు వీటిని రన్ చేసేలా  చైనీస్‌‌ కంపెనీలు నిర్ణయించాయని పేర్కొన్నాయి. లైసెన్స్ ఫీజుల ద్వారా పేరెంట్ కంపెనీలు రెవెన్యూలను ఆర్జించాలని ప్లాన్ చేస్తున్నాయి. టెన్సెంట్ గేమ్స్‌‌కు చెందిన పబ్‌‌జీ గేమ్‌‌తో పాటు 117 చైనీస్ యాప్స్‌‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్స్‌‌లో గేమింగ్, డేటింగ్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాన్ అయిన యాప్స్‌‌ మళ్లీ ఆపరేట్ కావాలనుకుంటే ఇండియన్ పార్టనర్‌‌‌‌కు వీళ్లు గేమ్‌‌ను అమ్మేయాలని ఓ లాయర్ చెప్పారు. దీంతో పేరెంట్ కంపెనీకి రాయల్టీ రూపంలో కాస్త పేమెంట్ వస్తుందని పేర్కొన్నారు.  ఇండియా చైనీస్ యాప్స్‌‌ను బ్యాన్‌‌ చేసిన తర్వాత, చాలా గేమింగ్ యాప్స్‌‌ పెద్ద మొత్తంలో యూజర్లను కోల్పోయాయి. గ్లోబల్‌‌గా ఎంత పాపులారిటీ పొందాయో అంతే స్థాయిలో స్ట్రాంగ్ యూజర్‌‌‌‌ను బేస్‌‌తో కొత్త రీజియన్‌‌ను కంపెనీలు క్రియేట్ చేసుకోవాల్సి ఉందని మరో లాయర్ తెలిపారు.

మూసివేతే మార్గం..

రెవెన్యూ, ఫండింగ్‌‌ లేకపోవడంతో చాలా చైనీస్ యాప్స్ ఇండియాలో ఆపరేషన్స్‌‌ను మూసివేద్దామని అనుకుంటున్నాయి. కొన్ని ఇతర   కంపెనీలు ప్రభుత్వం నుంచి మరింత క్లారిటీ కోరుతున్నాయి.  ప్రభుత్వం నుంచి మరింత క్లారిటీ రాకపోతే, న్యాయపోరాటం ద్వారా తేల్చుకోవాలని చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చైనీస్ కంపెనీల ఫండ్ రైజింగ్‌‌పైనా కఠిన ఆంక్షలు పెట్టింది. దీంతో వారి ఇండియన్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు. ఐదు వేల నుంచి 15 వేల మంది వరకు జాబ్స్‌‌ కోల్పోయే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి. జూన్‌‌లో తొలిసారి చైనీస్ యాప్స్‌‌పై నిషేధం విధించిన తర్వాత, చైనీస్ కంపెనీలకు పలు ప్రశ్నలను కేంద్రం సంధించింది.  ఇండియాలో ఆపరేషన్స్‌‌ను మూసివేయడం, ఉద్యోగుల జాబ్స్ కోల్పోవడం వంటి విషయాలపై కంపెనీలు స్పందించాలని కేంద్రం ఆదేశించింది. అయితే కమిటీ ముందుకు కొన్ని కంపెనీల స్పందనలే వచ్చాయని, మిగిలిన కంపెనీల రెస్పాన్స్‌‌లు ఇంకా రావాల్సి ఉందని సీనియర్ ప్రభుత్వ ఆఫీసర్‌‌ ఒకరు తెలిపారు.

మొత్తంగా 224 యాప్స్ బ్యాన్..

మూడు రౌండ్స్‌‌లో భాగంగా.. ప్రభుత్వం 224 చైనీస్ యాప్స్‌‌ను నిషేధించింది. ప్రజల డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, దేశ భద్రతకు ఇది చేటు అని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టానికి పూర్తిగా వ్యతిరేకమని, ఎలాంటి రిలీఫ్ ఉంటుందని తాను భావించడం లేదని చైనీస్ ఇంటర్నెట్ కంపెనీలతో పనిచేసే ఓ టెక్నాలజీ పాలసీ లాయర్ చెప్పారు. చాలా కంపెనీలు ప్రస్తుతం లీగల్ ఆప్షన్స్‌‌ ను వెతుకుతున్నాయి. చాలా చైనీస్ యాప్స్‌‌కు ఇండియానే అతిపెద్ద యూజర్ మార్కెట్‌‌. అందుకే ఇక్కడ తిరిగి వ్యాపారాన్ని నడిపించడానికి ఇవి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి.

For More News..

ముంబైని ఆపతరమా! ఐదో టైటిల్‌‌పై రోహిత్‌ సేన దృష్టి..

లంచం కోసం పక్కా స్కెచ్

Latest Updates