నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్​అమ్మకం

తండ్రీకొడుకు అడ్వకేట్​తో కలసి కోట్ల రుపాయలు విలువ చేసే 300 గజాల ప్లాట్​ను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన సంఘటన మీర్​పేట పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడకి చెందిన చారకొండ వెంకటేశ్వర్లు(59) కొడుకు ఉదయ్ కుమార్(27). వీరిద్దరికి రంగారెడ్డి జిల్లాకోర్టులో పనిచేసే శ్రీకాంత్ రెడ్డి అనే అడ్వకేట్ తో పరిచయం ఏర్పడింది. అతని సలహా మేరకు మీర్ పేట నందిహిల్స్ కాలనీలోని  సర్వేనంబర్ 28లో ఉన్న 300 గజాల స్థలం ఓనర్​పేరు మల్లికార్జున రావు అని నకిలీ ఆధార్ కార్డు తయారు చేశారు.

ఫోర్జరీ సంతకాలతో 22‌–‌10–2018న శివ శరనప్ప అనే వ్వక్తికి ప్లాట్ అమ్మేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ప్లాటుకు కంచె వేసి శ్రీకాంత్ రెడ్డి ఫోన్ నంబర్ రాశారు. ఆ తర్వాత ప్లాటు ఓనర్​వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్ కుమార్ ని  అదుపులోకి తీసుకుని విచారంచగా అసలు విషయం బయట పడింది. నిందితులు ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. శివ శరనప్ప పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.