రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​కు మాతృవియోగం

ముంబై: బీజేపీ సీనియర్ నాయకురాలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తల్లి చంద్రకాంత్ గోయల్ కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య కారణంగా ఆమె చనిపోయారని పీయూష్ గోయల్ ట్విట్టర్​ద్వారా తెలిపారు. ఆమె యావజ్జీవితాన్ని ప్రజా సేవకే అంకింతం చేశారని అన్నారు. శనివారం ఉదయం దహన సంస్కారాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చంద్ర కాంత్ గోయల్ ముంబైలోని మాతుంగ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమర్జెన్సీ తర్వాత ముంబై కార్పొరేటర్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె భర్త వేద్ ప్రకాశ్ గోయల్ కూడా బీజేపీ సీనియర్ నాయకులు. పార్టీ ట్రెజరర్​గా వాజ్ పేయి ప్రభుత్వంలో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు. చంద్రకాంత్ మృతి పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు ట్విట్టర్ లో సంతాపం ప్రకటించారు.

Latest Updates