బ్రాడ్‌ కు ఫైన్‌‌ వేసిన సీనియర్ బ్రాడ్

దుబాయ్‌‌: ఇంగ్లండ్ ఫాస్ట్‌‌ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ కు జరిమానా పడింది. పాకిస్తాన్‌‌తో జరిగిన తొలి టెస్ట్‌‌లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు .. బ్రాడ్ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఓ డీమెరిట్ పాయింట్‌ ను కేటాయించారు. ఈ మేరకు మ్యా చ్‌ రిఫరీ, బ్రాడ్ తండ్రి అయిన క్రిస్‌ బ్రాడ్‌ నిర్ణయం తీసుకున్నాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ 46వ ఓవర్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ యాసిర్‌‌‌‌ షాను ఔట్ చేసిన సందర్భంలో బ్రాడ్ అనుచితంగా వ్యా ఖ్యానించినట్లు అంపైర్లు గుర్తించారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌లోని ఆర్టికల్‌‌ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చారు. ఎలాంటి విచారణ అవసరం లేకుండానే బ్రాడ్ తప్పును అంగీకరించాడని క్రిస్‌ వెల్లడించారు. 24 నెలల కాలంలో బ్రాడ్‌ ఇలా చేయడం ఇది మూడోసారి.

Latest Updates