ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ కు కరోనా!

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో పని చేసే ఓ సీనియర్ సైంటిస్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో మొత్తం ఐసీఎంఆర్ బిల్డింగ్ ను శానిటైజ్ చేశారని సమాచారం. ముంబైకి చెందిన సదరు సైంటిస్టు కొద్ది రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చారని.. ఆదివారం ఆయనకు టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా వచ్చిందని తెలిసింది. ముంబై ఐసీఎంఆర్ లోని సైంటిస్ట్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ లో సదరు సైంటిస్ట్ విధులు నిర్వహిస్తున్నారు. గత వారం జరిగిన సదరు సైంటిస్ట్ ఓ మీటింగ్ లో పాల్గొన్నారని.. ఆ కార్యక్రమంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ కూడా హాజరయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. హెడ్ క్వార్టర్స్ ను శానిటైజ్, ఫుమిగేషన్ చేయించడంతోపాటు ఉద్యోగులకు ఓ మెసేజ్ చేసిందని తెలిసింది. ‘అవసరమైతే కరోనా కోర్ టీమ్ మాత్రమే ఆఫీస్ కు రావాలి. ఇతరులు ఇళ్ల నుంచే పని చేయాలి’ అని ఎంప్లాయీస్ కు ఐసీఎంఆర్ ఆదేశించిందని సమాచారం.

Latest Updates