సెన్సెక్స్ @ 50 వేలు.. మెగా రికార్డ్​

ఐదున్నరేళ్లలోనే 25 వేల పాయింట్ల ర్యాలీ

మార్చి చివరి నుంచి 207 సెషన్లలోనే డబుల్‌‌

లాభాల్లో నాస్​డాక్​ తర్వాత మన సెన్సెక్సే

2025 నాటికి లక్ష పాయింట్లు?

కరోనా మహమ్మారి ఎకానమీని కిందికి లాగుతున్నా, యువ ఇన్వెస్టర్ల రాకతో సెన్సెక్స్​ 50 వేలకు దూసుకెళ్లింది. వర్క్​ఫ్రం హోమ్ తో దొరికిన టైమ్​ను కరెక్ట్​గా యూజ్​ చేసుకోవాలనే టార్గెట్​తో  కోట్లాది యువ ఇన్వెస్టర్లు స్టాక్​ మార్కెట్లో కొత్తగా ఎంటరయ్యారు. కరోనా కారణంగా  2020 మార్చి నాటికి పాతాళానికి చేరిన సెన్సెక్స్, ఆ తర్వాత తొమ్మిది నెలల్లో అడ్డూ, ఆపూ లేకుండా పెరిగింది. కార్పొరేట్లు మెరుగైన ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ప్రకటిస్తుండటంతోపాటు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం మార్కెట్​ను మరింత ఉత్తేజపరిచింది. అన్నీ కలిసి మన సెన్సెక్స్​ను మరపురాని మైలురాయికి చేర్చాయి.

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌సెన్సెక్స్ మొదటి సారిగా50 వేల పాయింట్ల మైలురాయిని గురువారం దాటింది. విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల ఇన్‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతుండడంతో కేవలం 32 సెషన్లలోనే 45 వేల మార్క్ నుంచి 50 వేలకు చేరుకోగలిగింది. కిందటేడాది మార్చి కనిష్టాల(25,981 పాయింట్ల) నుంచి సుమారు డబులయ్యింది. 2020 లో ఎక్కువగా లాభపడిన ఇండెక్స్‌‌‌‌లలో  యూఎస్‌‌‌‌ నాస్‌‌‌‌డాక్‌‌‌‌(86 శాతం) తర్వాత సెన్సెక్స్‌‌‌‌(80 శాతం) రెండో స్థానంలో ఉంది. ఈ బెంచ్ మార్క్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 2025 నాటికి లక్ష పాయింట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. 1990 లో మొదటి సారిగా 1000 పాయింట్లను దాటిన సెన్సెక్స్‌‌‌‌, 50 వేల మార్క్‌‌‌‌ను కేవలం 30 ఏళ్లలోనే టచ్‌‌‌‌ చేసింది. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికవ్వడంతో 2014 , మే లో మొదటి సారిగా  25 వేల పాయింట్లను దాటిన ఈ ఇండెక్స్‌‌‌‌,  కేవలం ఐదున్నరేళ్లలోనే  మరో 25 వేల పాయింట్లు పెరిగింది. ఈ 30 ఏళ్లలో హర్షద్‌‌‌‌ మెహతా, కేతన్‌‌‌‌ పరేఖ్, సత్యం స్కామ్‌‌‌‌లతో పాటు, యూఎస్‌‌‌‌ ఫైనాన్షియల్ క్రైసిస్‌‌‌‌తో భారీగా నష్టపోయినా, లిబరలైజేషన్ పాలసీలు, ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌ ఊపందుకోవడంతో తిరిగి  బౌన్స్ బ్యాక్ అవ్వగలిగింది.  1986, జనవరి 1 న 30 షేర్లతో  సెన్సెక్స్‌‌‌‌ను బీఎస్‌‌‌‌ఈ ఏర్పాటు చేసింది. 100 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఈ ఇండెక్స్ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులున్నాయని చెప్పొచ్చు. బీజేపీ నాయకత్వంలో సంకీర్ణం ప్రభుత్వం ఏర్పడడంతో 1999, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 11 న మొదటిసారిగా 5 వేల పాయింట్లను సెన్సెక్స్‌‌‌‌ను దాటగలిగింది. 2006 లో 10 వేలను, 2007 లో 20 వేల మార్క్‌‌‌‌ను టచ్‌‌‌‌ చేసింది. 2014 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బీజేపీ గెలవడంతో 25 వేల మైలురాయిని దాటగలిగింది.

మార్కెట్లకు మోడీ మంత్రం..

మోడీ ప్రధానిగా ఎన్నికయిన తర్వాత నుంచి మార్కెట్లు రికార్డ్‌‌‌‌ గరిష్టాలను నమోదు చేస్తూ వచ్చాయి. దేశంలో బిజినెస్‌‌‌‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెస్తున్న పాలసీలతో ఎఫ్‌పీఐలు దేశంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. పెడుతున్నారు. 2015 లో మొదటి సారిగా 35 వేలను దాటిన సెన్సెక్స్‌‌‌‌, బీజేపీ మళ్లీ గెలవడంతో 2019లో 40 వేల మార్క్‌‌ను చేరుకోగలిగింది.  గత 32 సెషన్లలోనే ఐదు వేల పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అందుకుంది.

ప్రాఫిట్‌‌ బుకింగ్‌‌తో నష్టాల్లో క్లోజ్‌‌..

ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మార్నింగ్ సెషన్‌‌లో వచ్చిన లాభాలను ఇండియన్ స్టాక్‌‌ మార్కెట్లు కోల్పోయాయి. గురువారం సెషన్‌‌లో 800 పాయింట్ల రేంజ్‌‌లో ట్రేడయిన సెన్సెక్స్‌‌ చివరికి 167 పాయింట్ల నష్టంతో 49,625 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 50,184 పాయింట్ల వద్ద ఈ ఇండెక్స్ ఆల్‌‌టైమ్‌‌ హైని తాకింది. నిఫ్టీ 54 పాయింట్ల నష్టపోయి 14,590 పాయింట్ల వద్ద ముగిసింది. షాంఘై, టోక్యో, సియోల్‌‌ మార్కెట్లు పాజిటివ్‌‌గా ముగియగా, హాంకాంగ్‌‌ నెగిటివ్‌‌లో క్లోజయ్యింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు పెరిగి 72.99 వద్ద క్లోజయ్యింది.

వచ్చే నాలుగైదేళ్లలో సెన్సెక్స్‌  లక్ష పాయింట్లను టచ్‌ చేయగలదు. గత 20 ఏళ్లలో ఈ ఇండెక్స్‌ 10 రెట్లు పెరిగింది. ఇలానే కొనసాగితే  2030 నాటికి 1,25,000––1,50,000 పాయింట్లను టచ్‌ చేయగలుగు తుంది.  ఒకవేళ సెన్సెక్స్‌ ఏడాదికి 15-–16 శాతం సీఏజీఆర్‌‌తో పెరిగితే నాలుగైదేళ్లలో లక్ష పాయింట్లను దాటడం ఖాయం. కానీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితేనే ఇది జరుగుతుంది.-సీనియర్‌‌ ఇన్వెస్టర్‌‌ విజయ్‌కేడియా

సెన్సెక్స్‌‌ 50 వేల పాయింట్లను దాటడం మార్కెట్లు, ఇన్వెస్టర్లతో పాటు ఎకానమీకి కూడా మంచిది. ఫ్యూచర్‌‌ ఎకానమీకి మార్కెట్లు బారోమీటర్లుగా ఉంటాయి. మార్కెట్లో కనిపించేది నిజమే అయితే ఇండియన్‌‌ ఎకానమీ స్ట్రాంగ్‌‌గా రికవరీ అవుతున్నట్టే. – వీకే విజయ్‌‌కుమార్‌‌‌‌, జియోజిత్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ ఎనలిస్ట్‌.

 

Latest Updates