997 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ నెలను భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఈ నెలలో ఏకంగా 14 శాతం పెరిగింది. గత 11 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. కరోనాకు మందును కనుక్కోబోతున్నారనే న్యూస్, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు మార్కెట్లలో జోష్ పెంచాయి. ఈ క్రమంలో ఇవాళ( గురువారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 997 పాయింట్లు పెరిగి 33,718కి చేరుకుంది. నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 9,860 దగ్గర స్థిరపడింది.

Latest Updates