సీరియల్స్​కు సెన్సార్​ బోర్డు అవసరం: వేణుగోపాల చారి

sensor-board-for-serials

నేటి సీరియల్స్‌‌ మహిళలను మానసికంగా కుంగదీస్తూ, కుళ్లు కుతంత్రాలు నేర్పిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎప్‌‌.వేణుగోపాలచారి ఆవేదవ వ్యక్తం చేశారు.‘అరుణోదయ ఆర్ట్‌‌ క్రియేషన్స్‌‌’ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 2018 టీవీ పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. నిర్మాత లయన్‌‌ ఎ.విజయకుమార్‌‌ను దాన గుణశీల బిరుదుతో సత్కరించారు. ప్రముఖ టీవీ నటీనటులు ప్రీతినిగమ్‌‌, అడబాలను జీవన సాఫల్య పురస్కారాలతో సన్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్‌‌.వేణుగోపాలాచారి మాట్లాడుతూ టీవీ సీరియల్స్‌‌ ను సినిమాలకు ధీటుగా నిర్మిస్తున్నారని చెప్పారు. మహిళలమ మహిళలను విలన్లుగా చూపించడం తగ్గించాలని  సూచించారు. సీరియళ్లకు ప్రత్యేక సెన్సార్‌‌ బోర్డు అనవసరం ఉందన్నారు. కళా పత్రిక సంపాదకుడు మహ్మద్​రఫి సభాధ్యక్షత వహించారు. టీఆర్‌‌ఎస్‌‌ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు కె.శ్రీధర్‌‌రావు, దర్శక రచయిత డాక్టర్‌‌ ప్రభాకర్‌‌ జైని, డాక్టర్‌‌ బి.పాండు రంగారావు, తెలంగాణ గోశాల అధ్యక్షులు మహేష్‌‌ అగర్వాల్‌‌, హైకోర్టు న్యాయవాది డాక్టర్‌‌ ఎం.ఎ.రహీమ్‌‌, లయన్‌‌ శ్రీరామ్‌‌ దత్తి టివి నిర్మాతల మండలి అధ్యక్షుడు  షరీఫ్​, రచయితలు యడవల్లి, వెనిగళ్ల రాంబాబు తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు.

జీవీఆర్‌‌ ఆరాధన సంస్థ అధ్యక్షులు గుది బండి వెంకటరెడ్డిని అరుణోదయ ఉత్తమ కళాసేవ పురస్కారంతో, మాచిరాజు సాయి ప్రసాద్‌‌ను మార్గదర్శి పురస్కారంతో, రచయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరిని సారస్వత శిరోమణి అవార్డుతో, కె.వి.గీతాకుమారిని మాతృశ్రీ బిరుదుతో సన్మానించారు. ఈ సందర్భంగా చొక్కాపు వెంకట రమణ ఆధ్వర్యంలో ప్రముఖ న్యత్య గురువులు అవీల, కె.రాధిక శిష్యులు కూచిపూడి వృత్యాలు, సందీప్‌‌ సాయి మిమిక్రీ, కళ్యాణ్‌‌ క్విక్‌‌ మేజిక్‌‌ అలరించాయి. అరుణోదయ అధ్యక్షులు డాక్టర్‌‌ ముళ్లపూడి సూర్యచంద్ర, డాక్టర్‌‌ రాచపూడి ద్రాక్షాయణి సమన్వయకర్తలుగా వ్యవహరించగా, డబ్బింగ్‌‌ కింగ్‌‌ ఆర్‌‌సీఎం రాజు, యాంకర్‌‌ రేణుశ్రీ, వ్యాఖ్యాతలుగా ఆకట్టుకున్నారు. ప్రత్యేక జ్యూరీ బహుమతులను నిర్మాతలు మన చౌదరి, రేబాల శ్రీనివాస్‌‌రెడ్డి, నటీనటులు శిరీష, వరుణ్‌‌, సంధ్య అందుకున్నారు.

Latest Updates