హురియత్‌ కాన్ఫరెన్స్‌ నుంచి తప్పుకున్న కాశ్మీర్‌‌ వేర్పాటు వాది జిలానీ

  • పాకిస్తాన్‌ నుంచి వస్తున్న విమర్శలే కారణం అంటున్న అననుచరులు

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌‌ వేర్పాటు వాద నేతల్లో సీనియర్‌‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ జీవితకాల ఛైర్మన్‌ సయ్యద్‌ అలీ షా జిలానీ ఆ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 90 ఏళ్ల జిలానీ 1990ల నుంచి కాశ్మీర్‌‌ వ్యాలీలో ఆందోళనలు చేశారు. ఆయన హరియత్‌కు లైఫ్‌లాంగ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. 2010లో కాశ్మీర్‌‌లో జరిగిన గొడవ కారణంగా ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అతను హౌస్‌ అరెస్ట్‌లోనే ఉన్నారు. కాగా.. హరియత్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఆడియో మెసేజ్‌ ద్వారా చెప్పారు. “ప్రస్తుతం హురియత్‌ కాన్ఫరెన్స్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా నేను రాజీనామా చేస్తున్నాను. దీనికి సంధించి అన్ని కాన్‌స్టిటుయనట్స్‌కు లెటర్‌‌ పంపాను” అని జిలానీ ఆడియో మెసేజ్‌లో చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌ విడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే దానికి ఇదే నిదర్శనం అని విశ్లేషకులు చెప్తున్నారు. జమ్మూకాశ్మీర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై జిలానీ స్పందించనందుకు పాకిస్తాన్‌ నుంచి ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయన రాజీనామా చేశారని అనుచరులు చెప్తున్నారు.

Latest Updates