తులసీ రామ్‌ మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు రాళ్లు జారిపడి తలకు గాయాలై చనిపోయిన ఏపీ సిపాయి తులసీ రామ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరిగాయి. ఆయన స్వస్థలమైన పితానివానిపాలెంలో సైనిక లాంఛనాలతో అధికారుల గౌరవ వందనాల మధ్య ఈ అంత్యక్రియలు జరిగాయి. విశాఖపట్నంలోని పితానివానిపాలెంకు చెందిన తులసీ రామ్ భౌతికకాయం జనవరి 13న విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. సైనికాధికారులు ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సోమవారం విమానాశ్రయానికి చేరుకున్న తులసీ రామ్ భౌతికకాయాన్ని ఎయిర్‌పోర్టులోని శ్రద్ధాంజిలి స్టాల్‌కు తరలించి కాసేపు అక్కడ ఉంచారు. ఏసీపీ (వెస్ట్) స్వరూప రాణి, విశాఖపట్నం ఆర్మీ కల్నల్ డీకే. రాయ్ తలసీ రామ్ మృతదేహానికి దండలు వేసి నివాళులు అర్పించారు. తులసీ రామ్ ఇండియన్ ఆర్మీకి చెందిన నాగా రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

Latest Updates