యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ ఫైనల్లో సెరెనా

  • గెలుపు ఇంకొక్క అడుగు దూరంలో
  •  గెలిస్తే ‘ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డు’ సమం

ఆటకు కొన్నాళ్లు దూరమైనా.. ఆటలో కాస్త వెనుకబడ్డా.. యువ కెరటాలు దూసుకొచ్చినా.. తన స్థా యి ఏమాత్రం తగ్గలేదని అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ నిరూపించింది..! పాతతరం ఆటకు కొత్త నైపుణ్యాన్ని జోడిం చి.. మళ్లీ ము నుపటి స్థా యిని అందుకుం టూ… ఇప్పటి వరకు ఒక్కరికే సా ధ్యమైన ఓ అద్భుత రికార్డుకు అడుగుదూరంలో నిలిచింది..! గతంలో మూడుసార్లు అవకాశం వచ్చినా.. ఏదో అడ్డం కితో దూరమైపోయిన ‘24వ గ్రాండ్‌ స్లామ్‌‌’ కలను నెరవేర్చుకునేం దుకు మరోసారి సి ద్ధమైం ది..! అయితే ఈ కల సా కారం కావాలంటే 19 ఏళ్ల టీనేజ్‌ స్టార్‌‌ అండ్రెస్కూను అడ్డుకో వాలి..! మరి సెరె నా ఏం చేస్తుం దో చూద్దాం ..!!

ప్రపంచ మాజీ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌.. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో ఎనిమిదోసీడ్‌‌‌‌ సెరెనా (అమెరికా) 6–3, 6–1తో ఐదోసీడ్‌‌‌‌ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌)పై గెలిచింది.  తద్వారా ఈ టోర్నీలో 101 విజయాలు సాధించిన క్రిస్‌‌‌‌ ఎవర్ట్‌‌‌‌ (అమెరికా) ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును సెరెనా సమం చేసింది. ఓవరాల్‌‌‌‌గా యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో టైటిల్‌‌‌‌ పోరుకు అర్హత సాధించడం అమెరికన్‌‌‌‌కు ఇది పదోసారి కావడం విశేషం. గంటా 10 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో..  స్వితోలినా నుంచి గట్టి పోటే ఎదురైంది. 44 నిమిషాల్లోనే క్వార్టర్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను ముగించిన సెరెనాకు.. ఈ మ్యాచ్‌‌‌‌లో తొలిసెట్‌‌‌‌ను గెలవడానికే  అంత సమయం పట్టింది. తొలి రెండు గేమ్‌‌‌‌లు పూర్తి  చేయడానికి 16 నిమిషాలు తీసుకుంది. తొలి గేమ్‌‌‌‌లో స్వితోలినాకు మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లు వచ్చినా.. సెరెనా సర్వీస్‌‌‌‌ నిలబెట్టుకుంది. ఇక రెండో గేమ్‌‌‌‌లో స్వితోలినా తన సర్వీస్‌‌‌‌లో 40–0తో ఉన్న దశలో అమెరికన్ వరుసగా పాయింట్లు నెగ్గి డ్యూస్‌‌‌‌కు వచ్చింది. వెంటనే బ్రేక్‌‌‌‌ చేసి 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌‌‌‌లో సెరెనా సర్వీస్‌‌‌‌ నిలుపుకుంది.. నాలుగో గేమ్‌‌‌‌లో  సర్వీస్ కాపాడుకున్నా స్వితోలినా  ఆధిక్యాన్ని 3–1కి తగ్గించింది. ఐదో గేమ్‌‌‌‌ను కాపాడుకున్న సెరెనా 4–1 ఆధిక్యంతో వెనుదిరిగి  చూసుకోలేదు. మిగతా నాలుగు గేమ్‌‌‌‌ల్లో పరస్పరం సర్వీస్‌‌‌‌లు కాపాడుకోవడంతో సెట్‌‌‌‌ సెరెనా సొంతమైంది. రెండో సెట్‌‌‌‌లో సెరెనాకు ఎదురే లేకుండా పోయింది. స్వితోలినా ఒకే ఒక్కసారి సర్వీస్‌‌‌‌ను కాపాడుకుంది. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 6 ఏస్‌‌‌‌లు సంధించిన సెరెనా, 1 డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌, 20 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసింది. 8 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో 4 కాపాడుకుని 34 విన్నర్లు కొట్టింది. 5 ఏస్‌‌‌‌లు, 4 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 17 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసిన స్వితోలినా 11 విన్నర్లే సాధించింది.

బెనిచ్​కు అండ్రెస్కూచెక్​..

మరో సెమీస్‌‌‌‌లో బియాంకా అండ్రెస్కూ (కెనడా) 7–6 (7/3), 7–5తో బెలిండా బెనిచ్‌‌‌‌ (స్విట్జర్లాండ్‌‌‌‌)పై నెగ్గి ఫైనల్‌‌‌‌చేరింది.  దీంతో కెనడా నుంచి గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించిన రెండో ప్లేయర్‌‌‌‌గా ఈ అమ్మాయి రికార్డులకెక్కింది. బెనిచ్‌‌‌‌తో రెండు గంటలా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో అండ్రెస్కూ సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌‌‌‌లో సర్వీస్‌‌‌‌ చేజారినా.. టైబ్రేక్‌‌‌‌లో వరుసగా పాయింట్లు గెలిచి పైచేయి సాధించింది. ఇక రెండో సెట్‌‌‌‌లో 2–5తో వెనుకబడ్డా.. డబుల్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ పాయింట్లతో చివరి ఐదు గేమ్‌‌‌‌లు నెగ్గి  విజయాన్ని అందుకుంది.

సెరెనా X అండ్రెస్కూ

సెరెనా తొలి యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ (1999) గెలిచినప్పుడు.. అండ్రెస్కూ ఇంకా పుట్టలేదు. అంటే ఆటలో అమెరికన్‌‌‌‌ అనుభవం అంత వయసు లేని టీనేజ్‌‌‌‌ అమ్మాయి ఇప్పుడు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శనివారం అర్ధరాత్రి ఈ ఇద్దరి మధ్య టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌ జరుగనుంది. ఒకవేళ ఇందులో సెరెనా గెలిస్తే 24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో మార్గరెట్‌‌‌‌ కోర్ట్​ (ఆస్ట్రేలియా) ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును సమం చేస్తుంది. అండ్రెస్కూ గెలిస్తే ఓ పెద్ద రికార్డుకు చెక్‌‌‌‌ పెడుతూ కెరీర్‌‌‌‌లో తొలి టైటిల్‌‌‌‌ను గెలిచిన ఘనతను సొంతం చేసుకుంటుంది. 178వ ర్యాంక్‌‌‌‌తో గత సీజన్‌‌‌‌ను ముగించిన అండ్రెస్కూ.. ఈ ఏడాది సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం 15వ ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతున్న ఈ కెనడియన్‌‌‌‌.. సోమవారం విడుదలయ్యే జాబితాలో 9వ స్థానానికి ఎగబాకుతుంది. టైటిల్‌‌‌‌ గెలిస్తే మరింత మెరుగైన ర్యాంక్‌‌‌‌ దక్కొచ్చు. గత నెలలో రోజర్స్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్లో సెరెనాతో అండ్రెస్కూ తలపడింది. కానీ తొలిసెట్‌‌‌‌లో 3–1 ఆధిక్యంలో ఉన్న దశలో అమెరికన్‌‌‌‌ వెన్ను నొప్పి కారణంగా  మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకుంది. 2017 ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గెలిచిన తర్వాత సెరెనా మూడు గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ ఆడినా మార్గరెట్‌‌‌‌ రికార్డును సమం చేయలేకపోయింది.

Serena Williams poised for multiple record-breaking US Open final

Latest Updates